Auto Driver : ఆటో డ్రైవర్ ని ప్రేమించి.. ప్రాణం తీసింది

సమాజంలో నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. కొందరు ఆడవాళ్లు కూడా నేరాల బాట పడుతున్నారు.. హత్యలు, దొంగతనాలు, మోసాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.

Auto Driver : ఆటో డ్రైవర్ ని ప్రేమించి.. ప్రాణం తీసింది

Auto Driver

Auto Driver : సమాజంలో నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. కొందరు ఆడవాళ్లు కూడా నేరాల బాట పడుతున్నారు.. హత్యలు, దొంగతనాలు, మోసాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. నేరం చేసిన తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఆలోచించడం లేదు. ఇలా హత్యకేసులో నిందితులుగా ఉంటూ ఎందరో మహిళలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మరికొందరు ఆరోపణలు ఎదురుకుంటూ సమాజంలో తిరుగుతున్నారు. తాజాగా ఓ మహిళ తనను ప్రేమించిన వ్యక్తిని భావతో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది.

Read More : MAA Elections : ‘మా’ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనియా, ఆసిఫ్ 2018 నుంచి స్నేహంగా ఉంటున్నారు. ఆసిఫ్ ఆటో డ్రైవర్. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. పలుమార్లు శారీరకంగా కూడా కలిశారు. అయితే.. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సోనియా పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఈ విషయంలో సోనియా మాటను ఆసిఫ్ నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలోనే ఆసిఫ్ ను కలిసేందుకు తన బావను వెంటపెట్టుకొని జలంధర్ నుంచి గురుగ్రామ్ కి వెళ్ళింది సోనియా. ముగ్గురూ కలిసి ఘటా అనే గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి మద్యం సేవించారు.

Read More : Andhra Pradesh : కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దు – సీఎం జగన్

ఫుటుగా మద్యం సేవించడంతో ఆసిఫ్, సోనియా విచక్షణ కోల్పోయి గొడవపడ్డారు. ఈ గొడవ కాస్త పెద్దదైంది. దీంతో సోనియా, ఆమె బావ ఇనుప రాడ్లు, రాళ్లతో ఆసిఫ్ పై దాడి చేశారు. ఈ దాడిలో ఆసిఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటా గ్రామానికి చెందిన ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఇద్దరూ ఆసిఫ్‌పై దాడి చేయడం చూశాడు. భయంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలికి చేరుకునే సరికే ఇద్దరు పారిపోయారు. తప్పించుకుని పోయిన సోనియాను, ఆమె బావను పోలీసులు ఈ ఘటన జరిగిన మూడు గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారు.