Biker Saved By Helmet: హెల్మెట్ విలువ తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..! క్షణాల వ్యవధిలో రెండుసార్లు బైకర్‌ను కాపాడిన హెల్మెంట్..

బైక్‌పై ప్రయాణించే క్రమంలో హెల్మెంట్ ధరించడం ఎంతముఖ్యమో తెలుపుతూ ఢిల్లీ పోలీసులు ట్విటర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ వీడియోలో ఓ బైకర్ హెల్మెంట్ ధరించడం ద్వారా క్షణాల్లో రెండు సార్లు ప్రాణాలను కాపాడుకున్నాడు.

Biker Saved By Helmet: హెల్మెట్ విలువ తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..! క్షణాల వ్యవధిలో రెండుసార్లు బైకర్‌ను కాపాడిన హెల్మెంట్..

Biker Saved By Helmet

Biker Saved By Helmet: మనం మోటార్ సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో ఎప్పుడు ఏరూపంలో ప్రమాదం పొంచిఉంటుందో చెప్పడం కష్టం. మనం ఎంత జాగ్రత్తగా బైక్ నడిపినా ఎదుటివారి తప్పిదం వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ప్రమాదాల సమయంలో అనేకసార్లు హెల్మెంట్ ధరించడం కారణంగా ప్రాణాలతో బయటపడిన సంఘటనలు అనేకం చూశాం. తాజాగా హెల్మెంట్ ధరించి వాహనం నడపడం వల్ల ఓ బైకర్ క్షణాల వ్యవధిలో రెండుసార్లు ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు శీర్షికగా.. హెల్మెంట్ ధరించడం వలన మీరు ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు.. ఇలా అనేకసార్లు ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు’ అని రాశారు.

Helmet Lock : హెల్మెట్ పెట్టుకోవడమే కాదు.. లాక్ కూడా వేసుకోవాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. ప్రమాదాలు జరిగిన సమయంలో పూర్తిగా ముఖాన్ని కప్పిఉంచే హెల్మెంట్లను సరిగ్గా ధరించడం వల్ల తీవ్ర గాయాల నుంచి 64శాతం, తలకు గాయాలు కావటం వంటి ఘటనలు 74శాతం తగ్గాయి. తాజాగా ఢిల్లీ పోలీసులు ట్విటర్ లో షేర్ చేసిన వీడియోలో.. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తున్నాడు. అప్పటికే రహదారిపై ఉన్న ఓ కారు ఒక్కసారిగా ముందుకు కదిలింది. దానిని తప్పించబోయిన బైకర్.. కారును స్వల్పంగా ఢీకొట్టి ఎదురుగా ఫుట్ పాత్ పై ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో అక్కడే బైక్ తో సహా పడిపోయాడు. హెల్మెంట్ కారణంగా తలకు ఎలాంటి గాయంకాకపోవటంతో నెమ్మెదిగా లేచి నిలబడ్డాడు. ఇదేసమయంలో బైక్ ఢీకున్న స్తంభం కూలి బైకర్ నెత్తిపై పడింది. తలకు హెల్మెంట్ ఉండటంతో ఆ వ్యక్తి కిందపడి మళ్లీ యదావిథిగా లేచి నిలబడ్డాడు. క్షణాల వ్యవధిలోనే రెండు సార్లు హెల్మెంట్ కారణంగా ఆ బైకర్ ప్రాణాలను రక్షించుకోగలిగాడు.

15సెకన్లు కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ట్విటర్ లో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 26,000 కంటే ఎక్కువ మంది నెటిజన్లు లైక్‌లు చేశారు. ఐదువేల మంది వరకు రీ ట్వీట్లు చేశారు. ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు.. ఈ బైకర్ ఎంతో అదృష్టవంతుడు అంటూ రాస్తున్నారు. మరికొందరు నెటిజన్లు.. బైకర్లకు హెల్మెంట్ శ్రీరామరక్ష అంటూ పేర్కొన్నారు.