Buffalo Bus stand inauguration : రిబ్బన్ కట్ చేసి బస్టాండ్ ఓపెనింగ్ చేసిన బర్రె..

ఓ బర్రె రిబ్బన్ కట్ చేసి బస్టాండ్ ను ప్రారంభించింది. అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Buffalo Bus stand inauguration : రిబ్బన్ కట్ చేసి బస్టాండ్ ఓపెనింగ్ చేసిన బర్రె..

Bus Stand Inauguration With Buffalo

buffalo bus stand inaugurated  : ఏదైనా ఓ కొత్త నిర్మాణం జరిగితే..స్థానిక రాజకీయ నాయకులతోనే..ఏ సినిమా తారలతోనే ఓపెనింగ్ చేయిస్తుంటారు. కానీ కర్ణాటకలో మాత్రం ఓ బస్టాండ్ నిర్మించి దాన్ని ఓ బర్రె (గేదె)తో ఓపెనింగ్ చేశారు స్థానికులు. ఆ బర్రె కూడా చక్కగా రిబ్బన్ కట్ చేసి బస్టాండ్ ను ప్రారంభించింది. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ బర్రెతో బస్టాండ్ ఓపెనింగ్ చేయటం వెనుక ఉన్న కథాకమామీషు ఏంటో చూద్దాం..

కర్ణాటకలోని గదగ్‌ జిల్లాలోని బలే హూసూర్‌ గ్రామంలో ఉన్న ఓ బస్టాండ్ ఎప్పుడో పాడైపోయింది. చాలా సంవత్సరాలే గడిచిపోయింది. దీంతో అక్కడ కొత్త బస్టాండ్ నిర్మించాలని స్థానికులు ప్రభుత్వ అధికారులకు పదే పదే విన్నవించుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా పలుమార్లు విన్నవించుకున్నా ఏమాత్రం ఫలితం లేదు. ఎవ్వరు పట్టించుకోలేదు. దీంతో విసిగివేసారిన గ్రామస్థులు చందాలువేసుకొని తాత్కాలిక బస్టాండ్‌ను నిర్మించారు. దీని ప్రారంభోత్సవం కార్యక్రమం ద్వారి స్థానిక ప్రజాప్రతినిధులకు తమ వినూత్న నిరసన ద్వారా ఝలక్ ఇవ్వాలనుకున్నారు. దానికో ప్లాన్ కూడా వేశారు. ప్రజాప్రతినిధులకు బదులుగా ఓ బర్రెను తీసుకొచ్చారు. ఆ బర్రెతోనే రిబ్బన్ కటింగ్ చేయించి బస్టాండ్ ను ప్రారంభించారు.

Also read : Shark Fish : షికారుకు వెళ్లి..షార్క్‌తో పరాచికాలా? చుక్కలు చూపెట్టిందిగా..

ఈ వినూత్న కార్యక్రమాన్ని చూసినవాళ్లంతా ‘క్యా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ హై’ అని వ్యంగ్యస్ర్తాలు సంధించారు. ఈ బర్రె బస్టాండ్ ఓపెనింగ్ సందర్భంగా ఓ గ్రామస్థుడు మాట్లాడుతూ ‘రెండేళ్ల నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాం. అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేశాం. అయినా ఎవ్వరు పట్టించుకోలేదు. అందుకే మేమంతా చందాలువేసుకొని తాత్కాలిక బస్టాండ్‌ను నిర్మించుకున్నాం. ప్రజాప్రతినిధులకు బుద్ధిచెప్పాలన్న ఉద్దేశంతోనే బర్రెతో ప్రారంభించాం’ అని తెలిపారు. ఏది ఏమైనా ‘డబులు ఇంజన్ సర్కార్’కు స్థానికులు భలే ఝలక్ ఇచ్చారుగా..