Master Driver: బాబోయ్ నువ్వు గ్రేట్ సామి.. తెలివితక్కువ పనైనా.. వీడియో చూస్తే హాట్‌బీట్ పెరగడం ఖాయం..

కారు డ్రైవింగ్ అంటే అంత‌ఈజీ కాదు. చిన్నపాటి రోడ్డులో కారును మలుపు తిప్పాలంటే నానా తంటాలు పడాల్సిందే. కొందరు మాత్రం తేలిగ్గా కారును చిన్నపాటిరోడ్డులో మలుపు తిప్పేస్తారు. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Master Driver: బాబోయ్ నువ్వు గ్రేట్ సామి.. తెలివితక్కువ పనైనా.. వీడియో చూస్తే హాట్‌బీట్ పెరగడం ఖాయం..

Master Driving

Master Driver: కారు డ్రైవింగ్ అంటే అంత‌ఈజీ కాదు. చిన్నపాటి రోడ్డులో కారును మలుపు తిప్పాలంటే నానా తంటాలు పడాల్సిందే. కొందరు మాత్రం తేలిగ్గా కారును చిన్నపాటిరోడ్డులో మలుపు తిప్పేస్తారు. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఘటన ఏ ప్రాంతంలోనిది అనేది స్పష్టత లేదు.

Burger King Outlet: రూ.10 తీసుకొని చిన్నారికి బర్గర్ ఇచ్చిన సిబ్బంది.. సన్మానించిన కంపెనీ ప్రతినిధులు.!

వీడియోలో ఇల్లు రోడ్డుకు ఎత్తుగా ఉన్నట్లు ఉంది. ఇంటిలోకి వెళ్లేందుకు ఓ పొడవాటి గోడలా రోడ్డును నిర్మించారు. అయితే, ఆ రోడ్డులాంటి గోడపైనే కారు నడిపే వ్యక్తి తన కారును మలుపు తిప్పాడు. ఆ దారిపై ఒక్కకారు మాత్రమే పట్టేస్థలం ఉంది. అంగులం మేర కారును వెనక్కు రాణించినా అది కిందపడిపోయే ప్రమాదం ఉంది. కానీ, కారు నడిపే వ్యక్తి తన డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. కొంచెంకొంచెంగా కారును పక్కకు తిప్పుతూ ఆ చిన్న రోడ్డుపైనే పూర్తిగా కారును మలుపు తిప్పాడు. ఈ క్రమంలో వీడియో చూసేవారికి కారు ఎక్కడ కిందపడుతుందోనన్న టెన్షన్ వెంటాడుతుంది.

ఈ వీడియోను ఫిగెన్ అనే ఖాతాదారు షేర్ చేశాడు. కొద్దిగంటల్లోనే 11 మిలియన్ల మంది వీక్షించారు. అనేకమంది నెటిజన్లు తమ కామెంట్ల రూపంలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ ఈ వీడియోను చూస్తుంటే నా తల పగిలిపోతోంది అంటూ రాశాడు. అయితే చాలా మంది నెటిజన్లు కారు నడిపే వ్యక్తి తెలివితక్కువ పనిని ఎత్తుచూపుతూనే.. తన డ్రైవింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. వీడియోలోని వ్యక్తి కారును మలుపు తిప్పేకంటే రివర్స్ గేర్ ఉపయోగించి నేరుగా కిందకు దింపుకొనే అవకాశం ఉంది. కానీ తన డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.