కేంద్ర మంత్రితో రైతుల బృందం భేటీ…నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు

  • Published By: venkaiahnaidu ,Published On : December 7, 2020 / 11:29 PM IST
కేంద్ర మంత్రితో రైతుల బృందం భేటీ…నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు

Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొద్ది రోజులుగా పెద్దగా ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోవడంతో డిసెంబర్-8న భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారత్ బంద్ కు కొద్ది గంటలముందు సోమవారం(డిసెంబర్-7,2020)20మందితో కూడిన రైతుల బృందం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ని ఢిల్లీలో కలిసింది.



పద్మశ్రీ అవార్డు గ్రహీత కమల్​ సింగ్​ చవాన్​ నేతృత్వంలోని ‘ప్రగతిశీల రైతుల’ బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి కొత్త చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. కొత్త వ్యవసాయ చట్టాలకు తాము మద్దతిస్తున్నట్టు తెలిపింది. చట్టాలను రద్దు చేయాల్సిన పనిలేదని.. కొన్ని సవరణలు చేస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ బృందంలో హరియాణాకు చెందిన రైతులే అధికంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో ఈ బృందం వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆందోళన చేస్తున్న రైతులు తప్పుదోవ పట్టించబడ్డారని,ఎమ్ఎస్ పీ,మండీ వ్యవస్థ కొనసాగుతుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని తోమర్ తో మీటింగ్ అనంతరం ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ క్లబ్(సోనిపట్)అధ్యక్షుడు కన్వాల్ సింగ్ చౌహాన్ తెలిపారు.



మరోవైపు, మంగళవారం జరగనున్న భారత్​ బంద్​ కు రైతు సంఘాలు సర్వ సన్నద్ధమయ్యాయి. సాగు చట్టాలపై వ్యతిరేకతను, తమ ఐక్యతను ప్రదర్శించేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. డిసెంబర్ 8 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చారు. మరోవైపు భారత్​ బంద్​కు విపక్షాల నుంచి మద్దతు లభించింది. రైతులు పిలుపునిచ్చిన భారత్​ బంద్​ కు 20 రాజకీయ పార్టీలు, 35 విద్యార్థి సంఘాలు, 5 కార్మిక సంఘాలు, 50 ట్రాన్స్ ఫోర్ట్ సంఘాల మద్దతు పలికాయి.

+
కాగా, ఆరో దఫా చర్చల్లో భాగంగా.. ఈ నెల 9న కేంద్రం,మరోసారి రైతులతో చర్చించనుంది. చట్టాలను రద్దు చేయకుండా నిర్దిష్ట సమస్యలను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయినప్పటికీ వీటిని రద్దు చేయాల్సిందేనన్న డిమాండ్​కు రైతన్నలు కట్టుబడి ఉన్నారు.