Google Map: గూగుల్ మ్యాప్‌ వల్ల ఇబ్బందిపడ్డా.. ప్రముఖ కమెడియన్ ట్వీట్‌కు గూగుల్ సమాధానం ఏమిటంటే?

కార్తికేయ ట్వీట్ వైరల్ కావటంతో గూగుల్ ఇండియా స్పందించింది.. ‘మాకు సరియైన మార్గాన్ని చూపిన మీలాంటి వినియోగదారులకు మా తరపున ధన్యవాదాలు.. మంచిగా మారే ఈ ప్రయాణం ఆగదు మిత్రమా.. దీనిపై ప్రజలు తమ స్పందనను తెలియజేయడం మొదలు పెట్టారు’ అంటూ గూగుల్ రిప్లై ఇచ్చింది.

Google Map: గూగుల్ మ్యాప్‌ వల్ల ఇబ్బందిపడ్డా.. ప్రముఖ కమెడియన్ ట్వీట్‌కు గూగుల్ సమాధానం ఏమిటంటే?

Google map

Google Map: మనకు తెలియని ప్రదేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా మనం ఉపయోగించేది గూగుల్ మ్యాప్. ఈ మ్యాప్ ద్వారా అధికశాతం మంది తమతమ గమ్యస్థానాలకు ఈజీగా చేరుకుంటున్నారు. అయితే, ఈ మ్యాప్ ఆధారంగా తమ గమ్యస్థానాలకు వెళ్లేవారు.. ప్లైఓవర్, రోడ్డు వచ్చిన ప్రాంతంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరియైన రూట్ మాప్ చూపించకపోవటంతో కిలోమీటర్ల దూరం వెళ్లి యూటర్న్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని చాలా మంది ఎదుర్కొనే ఉంటారు.

Google Map New Features : గూగుల్ మ్యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే.. ఏయే ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

తాజాగా.. ఢిల్లీలో నివాసముండే స్టాండప్ కమెడియన్ కార్తీక్ అరోరా అనే వ్యక్తి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ట్విటర్ ద్వారా గూగుల్ ఇండియాను ట్యాగ్ చేయడం ద్వారా ఈ సమస్యపై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదుపై గూగుల్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కార్తీకేయ గూగుల్ మ్యాప్ ద్వారా ప్రయాణిస్తున్నాడు. ఈ మ్యాప్‌లో ప్లై ఓవర్ గుర్తించకపోవటంతో రెండు కిలో మీటర్లు దూరంవెళ్లి యూటర్న్ తీసుకొని తిరిగి రావాల్సి వచ్చింది అంటూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్ లో గూగుల్ ను ట్యాగ్ చేసి.. ఇంత మంచి మ్యాప్ తయారు చేసి, చిన్న ఫీచర్ వేసి ప్లై ఓవర్ ఎక్కాలా? కిందకు వెళ్లాలా అని స్పష్టంగా చెప్పండి అంటూ ప్రశ్నించాడు. ఐదు అంగుళాల స్క్రీన్ పై అర మిల్లీమీటర్ విక్షేపణను ఎలా చూడగలరు అంటూ పేర్కొన్నాడు.

ఈ ట్వీట్ వైరల్ కావటంతో గూగుల్ ఇండియా స్పందించింది.. ‘మాకు సరియైన మార్గాన్ని చూపిన మీలాంటి వినియోగదారులకు మా తరపున ధన్యవాదాలు.. మంచిగా మారే ఈ ప్రయాణం ఆగదు మిత్రమా.. దీనిపై ప్రజలు తమ స్పందనను తెలియజేయడం మొదలు పెట్టారు’ అంటూ గూగుల్ రిప్లై ఇచ్చింది.