Electric Tractor : రైతుల‌కు శుభవార్త.. గంటకు రూ.10 ఖర్చుతో పొలం దున్నే ట్రాక్ట‌ర్

రైతుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఆటోమొబైల్ కంపెనీలు త‌మ ఆర్ అండ్ డీ హ‌బ్స్‌లో ట్రాక్ట‌ర్లు అభివృద్ధి చేస్తుంటాయి. అయితే రైతుగా మారిన ఇంజినీర్ నికుంజ్ కోర‌ట్‌ దానికి భిన్నంగా పంట పొలాల్లోనే 'మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0' పేరుతో బుల్లి ట్రాక్ట‌ర్ డెవ‌ల‌ప్ చేశారు.

Electric Tractor : రైతుల‌కు శుభవార్త.. గంటకు రూ.10 ఖర్చుతో పొలం దున్నే ట్రాక్ట‌ర్

Marut E-Tract 3.0

electric tractor : సాధారణంగా ట్రాక్టర్ తో పొలం దున్నిస్తే వేల రూపాయల్లో ఖర్చు అవుతుంది. కానీ ఓ ఇంజినీర్ గంటకు రూ.10 ఖర్చుతో పొలం దున్నే ట్రాక్టర్ ను తయారు చేశారు. రైతుల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రిస్తూ ఆటోమొబైల్ కంపెనీలు త‌మ ఆర్ అండ్ డీ హ‌బ్స్‌లో ట్రాక్ట‌ర్లు అభివృద్ధి చేస్తుంటాయి. అయితే రైతుగా మారిన ఇంజినీర్ నికుంజ్ కోర‌ట్‌ దానికి భిన్నంగా పంట పొలాల్లోనే ‘మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0’ పేరుతో బుల్లి ట్రాక్ట‌ర్ డెవ‌ల‌ప్ చేశారు. ఈ ట్రాక్ట‌ర్ ను అభివృద్ధి చేయ‌డానికి గుజ‌రాత్‌లో నికుంజ్ బ్ర‌ద‌ర్స్ సుమారు కోటి రూపాయల పెట్టుబ‌డి పెట్టారు. ఈ ‘మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0’కు తాజాగా ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఆటోమోటివ్ టెక్నాల‌జీ (ఏక్యాట్ – iCAT ) స‌ర్టిఫికేష‌న్ కూడా రావడం గమనార్హం.

పొలాలు దున్న‌డానికి కేవ‌లం గంట‌కు రూ.10 ఖ‌ర్చు మాత్ర‌మే కావడం శోచనీయం. రైతుల‌కు అందుబాటులోకి తేవ‌డానికి రూ.5.5 ల‌క్ష‌ల ధ‌ర పెట్టాల‌ని నిర్ణయించారు. దీని క‌మ‌ర్షియ‌లైజేష‌న్ కోసం నిధులు సాయం చేయాల‌ని, ఇన్వెస్ట‌ర్లు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని. ఫేమ్ ( FAME ) స‌బ్సిడీ ఇవ్వాల‌ని నికుంజ్ కొరాట్ కోరుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో ఎల‌క్ట్రిక్ రిక్షా ప్ర‌భంజాన్ని చూశాన‌ని నికుంజ్ కొరాట్ చెప్పారు. రోడ్డుపైకి ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ వ‌స్తున్న‌ప్పుడు విద్యుత్ వాహ‌నాల‌తో వ్య‌వ‌సాయం ఎందుకు చేయ‌కూడ‌ద‌ని అనిపించింద‌ని అన్నాడు. ‘మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0’ కేవ‌లం 4 గంట‌ల్లో చార్జింగ్ అవుతుందని తెలిపారు. ఇది చిన్న డీజిల్ ట్రాక్ట‌ర్ మాదిరిగా ఉంటుంద‌ని వెల్లడించారు.

తాను ప్ర‌తిపాదించిన ఈ-ట్రాక్ట్ 3.0 త‌యారీలో త‌మ సొంత గ్రామ రైతుల నుంచి మంచి స‌ల‌హాలు వ‌చ్చాయ‌ని నికుంజ్ కొరాట్ పేర్కొన్నారు. తాను అభివృద్ధి చేసిన ఎల‌క్ట్రిక్ ట్రాక్ట‌ర్ రూ.5.5 ల‌క్ష‌లు పెట్టి కొనుగోలు చేయ‌డానికి రైతులు ముందుకు రావ‌డం క‌ష్ట‌మేనని అన్నారు. చిన్న డీజిల్ ట్రాక్ట‌ర్ రూ.2.5 ల‌క్ష‌ల‌కే ల‌భిస్తుంద‌ని చెప్పారు. దీని కొనుగోలు ఖ‌ర్చు కాస్త ఎక్కువైనా.. డీజిల్‌తో పోలిస్తే ప‌దోవంతు ఖ‌ర్చు మాత్ర‌మే స‌రిపోతుంద‌న్నారు. లిథియం ఐర‌న్ ఫాస్పేట్ (ఎల్ఎఫ్టీ) ప్యాక్‌తో కూడిన లిథియం అయాన్ బ్యాట‌రీ ప్యాక్ వినియోగించాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0 లైఫ్ టైం 15 వేల గంట‌లు ప‌ని చేస్తుంది. గంట‌కు దాదాపు లీట‌ర్ డీజిల్ ఖ‌ర్చ‌యితే.. ఎల‌క్ట్రిక్ ట్రాక్ట‌ర్‌కు గంట‌కు రూ.10 మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంద‌ని నికుంజ్ చెబుతున్నారు. ఎల‌క్ట్రిక్ కార్లు, ఈ-బైక్‌లు, ఈ-స్కూట‌ర్ల వాడ‌కాన్ని ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ఫేమ్ స్కీమ్‌.. ట్రాక్ట‌ర్ల‌కు కూడా పొడిగించాల‌ని కోరుతున్నారు. ఒక‌వేళ ఫేమ్ స్కీమ్ అమ‌లైతే త‌మ ట్రాక్ట‌ర్‌పై రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సబ్సిడీ వ‌స్తుంద‌ని అంటున్నారు. మారుత్ ఈ-ట్రాక్ట్ 11 కిలోవాట్ల బ్యాట‌రీ ప్యాక్‌, మూడు కిలోవాట్ల మోటార్‌తో ప‌ని చేస్తుంది.

నికుంజ్ కొరాట్‌, అత‌ని సోద‌రులు మోహిత్ కుమార్‌, చందూలాల్‌ల‌తో క‌లిసి ఏర్పాటు చేసిన శ్రీ మారుత్ ఈ-అగ్రోటెక్ స్టార్ట‌ప్ ఆధ్వ‌ర్యంలో ఈ-ట్రాక్ట‌ర్ అభివృద్ధి అయింది. ఈ-ట్రాక్ట‌ర్లు కొత్త కాకున్నా.. పొలాల్లో అభివృద్ధి చేసిన తొలి ఈ-ట్రాక్ట‌ర్‌. చిన్న ఈ-ట్రాక్ట‌ర్‌తో మంచి వ‌ర్ష‌పాతం గ‌ల ప్రాంతాల్లో పండ్లు, తోట‌ల పెంప‌కం తేలిక‌.. మంచి రిట‌ర్న్స్ కూడా వ‌స్తాయి. చిన్న ట్రాక్ట‌ర్ల‌కు మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. సింగిల్ చార్జింగ్‌తో ఎనిమిది గంట‌లు ఆప‌రేష‌న్స్‌ చేయవచ్చు.