Hizab Row : హిజాబ్‌ ధరించిన అమ్మాయి ఏదోకరోజు భారత్ ప్రధాని అవుతుంది..ఇది రాసిపెట్టుకోండీ : అసదుద్దీన్ ఒవైసీ

హిజాబ్‌ ధరించిన అమ్మాయి ఏదోకరోజు భారత్ ప్రధాని అవుతుంది..ఇది రాసిపెట్టుకోండీ..అని అన్నారు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..

Hizab Row : హిజాబ్‌ ధరించిన అమ్మాయి ఏదోకరోజు భారత్ ప్రధాని అవుతుంది..ఇది రాసిపెట్టుకోండీ : అసదుద్దీన్ ఒవైసీ

A Girl In Hijab Will Be Country Pm

A girl in hijab will be country PM : ప్రస్తుతం భారత్ లో హాజాబ్ వివాదంపై చర్చ జరుగుతోంది. కర్ణాటకలో ప్రారంభమైన ఈ హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.అంతర్జాతీయ నేతలు కూడా భారత్ హిజాబ్ వివాదం గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కానీ టోపీ ధరించిన నేను పార్లమెంట్ కు వెళ్లొచ్చుగానీ..హిజాబ్ ధరించి విద్యార్ధినిలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లకూడాదా? అని ప్రశ్నించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈరోజు హిజాబ్ ధరించిన అమ్మాయి ఏదోక రోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుంది’’అని అన్నారు.

Also read : Hizab Row : హిజాబ్ తో లోపలికి రావద్దని స్కూల్ బయటే నిలిపివేసిన టీచర్..తీసివేసి క్లాసులకు వెళ్లిన విద్యార్ధినిలు

హిజాబ్ వివాదంపై పాక్ మంత్రులు విమర్శలకు ‘‘ఇది మా దేశం అంతర్గత సమస్య మేం చూసుకుంటాం..మీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి..వాటిపై దృష్టి పెట్టండి..బాలికా విద్య కోసం పోరాడే మలాలా యూసఫ్ జాయ్ పై తాలిబన్లు దాడి చేసిన పాకిస్థాన్ లో కదా..అటువంటి మీరు మాకు నీతులు చెప్పనక్కరలేదు’’ అని పాకిస్థాన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా మాట్లాడుతూ..‘‘హిజాబ్‌ ధరించిన మహిళ భారతదేశానికి ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అవుతుంది’’అని అన్నారు.

Also read : Asaduddin Owaisi: ‘టోపీతో నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు ఆడపిల్లలు హిజాబ్ తో కాలేజికి వెళ్లకూడదా’

‘‘హిజాబ్, నిఖాబ్‌ ధరించిన మహిళలు కాలేజీలకు వెళ్తారు. జిల్లా కలెక్టర్లు అవుతారు. న్యాయమూర్తులు అవుతారు.డాక్టర్లు,వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తారని అన్నారు. అలాగే..‘‘హిజాబ్‌ ధరించిన మహిళ ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంది..కావాలంటే నేను చెప్పింది రాసి పెట్టుకోండి. ఇది చూడటానికి నేను జీవించి ఉండకపోవచ్చు..కానీ ఏదోక రోజు ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది అని అన్నారు. హిజాబ్‌ ధరిస్తానని బిడ్డలు కోరితే తల్లిదండ్రులు తప్పకుండా మద్దతిస్తారు. హిజాబ్‌ ధరించడానికి తల్లిదండ్రులు అనుమతి ఇచ్చిన తర్వాత ఇక ఎవరు ఆపుతారో చూద్దాం’’ అంటూ ఒవైసీ ఉద్వేగంగా అన్నారు.

Also read :  Hizab :హిజాబ్ వివాదంపై పాక్ విమర్శలు..మా సమస్యను మేం చూస్కుంటాం..మీరు నీతులు చెప్పక్కర్లా

కాగా..కర్ణాటకలో హిజాబ్‌ వివాదం కొనసాగుతున్న క్రమంలో గత కొన్ని రోజులుగా మూసివేసిన స్కూల్స్ తిరిగి సోమవారం (ఫిబ్రవరి 14,2022) తెరుచుకున్నాయి. అయినా ఈ హిజాబ్ వివాదం మాత్రం కొనసాగుతునే ఉంది. మాండ్యలోని రోట‌రీ స్కూల్‌లో కొంద‌రు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి స్కూల్ కు వ‌స్తుండ‌ంటో ఓ టీచర్ వారిని గేటు బయటే అడ్డుకున్నారు. దీంతో ఆ ఉపాధ్యాయురాలితో విద్యార్థినుల త‌ల్లిదండ్రులు గొడ‌వ పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.