Flight Free Journey : స్కూల్ టాపర్లకు విమానంలో ప్రయాణించే అవకాశం.. ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రోత్సాహం

ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు విమానంలో ప్రయాణించే భారీ ఆఫర్ ఇచ్చారు. చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకున్న చోటుకు విమానంలో పంపిస్తానని ప్రోత్సహించారు. ప్రిన్సిపాల్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరిట్ సాధించారు.

Flight Free Journey : స్కూల్ టాపర్లకు విమానంలో ప్రయాణించే అవకాశం.. ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రోత్సాహం

Flight Free Journey : పాఠశాలలో విద్యార్థులు బాగా చదవాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తుంటారు. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే గిఫ్ట్ లు ఇస్తామని, కొత్త బట్టలు కొనిస్తామని పిల్లలను ప్రోత్సహిస్తారు. కాలేజీ విద్యార్థులైతే ఇంకొంచెం కాస్ట్ లీ గిఫ్టులు సెల్ ఫోన్, బైక్ కొనిస్తామని చెబుతుంటారు. అయితే ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు విమానంలో ప్రయాణించే భారీ ఆఫర్ ఇచ్చారు. చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకున్న చోటుకు విమానంలో పంపిస్తానని ప్రోత్సహించారు.

ప్రిన్సిపాల్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరిట్ సాధించారు. దీంతో ఆ ప్రిన్సిపల్ ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరు విద్యార్థులను విమానం ఎక్కించారు. మరో ఇద్దరిని నెల ఆఖరులో విమానం ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటన పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో చోటు చేసుకుంది. జిరాలో షాహీద్ గురుదాస్ రామ్ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల (బాలికలు)లో రాకేశ్ శర్మ ప్రన్సిపల్ గా ఉన్నారు. చదువులో పాఠశాల వెనుకబడి ఉండటాన్ని గమనించారు.

IndiGo 15th anniversary: ఇండిగో ఎయిర్‌లైన్స్ అద్భుత ఆఫర్.. రూ.915కే ప్రయాణం

ఈ నేపథ్యంలో బోర్డు పరీక్షల్లో ర్యాంకు సాధించిన వారిని తన సొంత ఖర్చులతో విమానం ఎక్కిస్తానని, దేశంలో వారు కోరుకున్న ప్రదేశానికి విమానంలో పంపిస్తానని హామీ ఇచ్చారు. అయితే నలుగురు విద్యార్థులు ప్రిన్సిపాల్ కోరిక నెరవేర్చారు.  గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు పదో తరగతి విద్యార్థులు, మరో ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షల్లో మెరిట్ సాధించారు.

దీంతో ఆ ప్రిన్సిపల్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మెరిట్ సాధించిన ఇద్దరు 12వ తరగతి బాలికలను విమానం ఎక్కించారు. అమృతసర్ నుంచి గోవాకు విమానంలో పంపించారు. మరో ఇద్దరిని నెల ఆఖరులో విమానం ఎక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆ విద్యార్థులు చాలా సంతోష పడ్డారు. విద్యార్థులను ప్రోత్సహించిన ప్రిన్సిపల్ ను అందరూ అభినందించారు.