Karnataka: సీఎంని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్.. నిమిషాల్లోనే సస్పెండైన ప్రభుత్వ టీచర్

ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడు 3,590 కోట్ల రూపాయలు అప్పులు ఉండేవి. ధరమ్ సింగ్, హెచ్‌డీ కుమారస్వామి, బిఎస్ యడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ హయాంలో అప్పులు వరుసగా రూ.15,635, రూ.3,545, రూ.25,653, రూ.9,464, రూ.13, 464 కోట్లు అయ్యాయి.

Karnataka: సీఎంని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్.. నిమిషాల్లోనే సస్పెండైన ప్రభుత్వ టీచర్

CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద విమర్శలు చేసిన ఒక ప్రభుత్వ టీచర్ మీద వేటు పడింది. సీఎంను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నిమిషాల్లోనే సస్పెన్షన్‌కు గురయ్యాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజు (శనివారం) సస్పెన్షన్ ఆర్డర్ పంపారు. చిత్రదుర్గ జిల్లాకు చెందిన శంతనమూర్తి ఎంజీ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభుత్వం ప్రకటించిన ఉచితాల వల్ల రాష్ట్రంపై భారం పడుతుందని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు.

TDP MP Kesineni Nani : ఎంపీ టికెట్ ఇవ్వకపోతే అక్కడే కూర్చుని సేవచేస్తా : కేశినేని నాని

ఆ పోస్టులో ‘‘ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడు 3,590 కోట్ల రూపాయలు అప్పులు ఉండేవి. ధరమ్ సింగ్, హెచ్‌డీ కుమారస్వామి, బిఎస్ యడ్యూరప్ప, సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ హయాంలో అప్పులు వరుసగా రూ.15,635, రూ.3,545, రూ.25,653, రూ.9,464, రూ.13, 464 కోట్లు అయ్యాయి. అయితే సిద్ధరామయ్య హయాంలో రాష్ట్ర అప్పు 2,42,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇదంతా సిద్ధరామయ్య సమయంలో ఇచ్చిన ఉచితాల కారణంగా’’ అని రాసుకొచ్చాడు. ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే, రాష్ట్ర పౌర సేవల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినందుకు సంబంధిత అధికారి నుంచి టీచర్ శంతనమూర్తికి సస్పెన్షన్ ఆర్డర్‌ వచ్చింది. శంతనమూర్తి తీరుపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.

Mallikarjun Kharge: నూతన పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఐదు హామీలను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సిద్ధరామయ్య ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ హామీల వల్ల ప్రభుత్వం భారం పెరుగుతుందని, రాష్ట్రం అప్పుల్లోకి కూరుకుపోతోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మే 13న ప్రకటించిన ఫలితాల్లో 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకోగా, అధికార బీజేపీకి 66 సీట్లు లభించగా, జనతాదళ్ సెక్యులర్ 19 సీట్లు గెలుచుకుంది.