Modi America Tour : అమెరికాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ అమెరికా చేరుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​ సందు అమెరికా రక్షణ, విదేశాంగ శాఖ అధికారులు, ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు.

Modi America Tour : అమెరికాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

Modi (4)

grand welcome to PM Modi : మూడు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్​లోని జాయింట్​ బేస్​ ఆండ్రూస్​ విమానాశ్రయం​లో మోడీకి ఘన స్వాగతం పలికారు. అమెరికాలో భారత రాయబారి తరణ్​జిత్​ సింగ్​ సందు అమెరికా రక్షణ, విదేశాంగ శాఖ అధికారులు, ప్రవాస భారతీయులు మోడీకి స్వాగతం పలికారు. మోడీ కోసం వందమందికి పైగా ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి వచ్చారు.

తన కోసం వచ్చిన ప్రవాస భారతీయులను మోడీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వాషింగ్ టన్ లోని హోటల్ కి చేరుకున్నారు. వాషింగ్టన్​లో తనకు స్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ మన ప్రవాసులే మనకు బలం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు తమ ప్రత్యేకతను చాటుకోవటం అభినందనీయమన్నారు.

Modi us tour : అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ..నేడు కమలాహారిస్ తో భేటీ

నేటి నుంచి 25 వరకు.. మూడ్రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. 2019 తర్వాత తొలిసారి అమెరికా వచ్చిన ప్రధాని.. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటిస్తారు. బ్యాక్‌ టు బ్యాక్‌ మీటింగులతో బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ అక్కడి ప్రముఖ సంస్థలకు చెందిన సీఈవోలతో సమావేశమవుతారు. ఐదుగురు టాప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌తో ముఖాముఖి సమావేశంలో పాల్గొనున్నారు ప్రధాని మోదీ.
అందులో ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్ కూడా ఉండే అవకాశం ఉంది. మిగతా నలుగురు ఎవరన్నది ఇంకా ఫైనల్‌ కాలేదు. ఆ తర్వాత అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహ్యారిస్‌తో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌, జపనీస్ ప్రధాని యోషియిడే సుగాలతో సమావేశం కానున్నారు.

Modi in America : ఇద్దరు ప్రధానులు, ఐదుగురు సీఈవోలతో మోదీ కీలక సమావేశాలు

రేపు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీకానున్నారు ప్రధాని మోదీ. ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక.. అదేరోజు వైట్‌హౌస్‌లో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోను మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులో అఫ్ఘానిస్తాన్ పరిణామాలు, ఇండో-పసిఫిక్‌ అజెండా, కోవిడ్‌-19, వాతావరణ మార్పులు వంటి అంశాలు చర్చకు రావచ్చు. అదేరోజు బైడెన్‌ ఇచ్చే డిన్నర్‌కు హాజరై.. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళతారు.

ఇక పర్యటనలో చివరిరోజు అయిన ఎల్లుండి.. న్యూయార్క్ లో జరిగే 76వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు మోదీ. కరోనా, ఉగ్రవాదం అంశాలను ప్రస్తావించనున్నారు. అఫ్ఘానిస్తాన్ పరిణామాలపై మనదేశ వైఖరిని అక్కడే ప్రకటించే అవకాశం ఉంది. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపైనా చర్చించే అవకాశం ఉంది. U.N.లో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి కూడా ప్రస్తావించనున్నారు.