Viral House : ఈ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో..వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటాయి

జగ్వంతి దేవి ఇల్లు ఓ వింత ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగ్వంతి దేవి ఇల్లు తలుపులు రెండు రాష్ట్రాల్లో తెరుచుంటాయి. ఓ డోరు పంజాబ్‌ రాష్ట్రంలో తెరుచుకుంటే, మరొక తలుపులు హర్యానాలో తెరుచుకుంటుంది.

Viral House : ఈ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో..వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటాయి

Viral House In Punjab Haryana Border

Viral House In Punjab-Haryana Border : ఓ వింత ఇల్లు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఓ ఇల్లు రెండు వీధులకు విస్తరించి ఉండొచ్చు. పూర్వం పెద్ద పెధ్ద ఇళ్లు అంటూ మండువా లోగిళ్లు అని చెప్పుకునే ఇళ్లు వీధిగుమ్మ ఓ వీధిలోకి..వెనక అంటే పెరటి గుమ్మ మరో వీధిలోకి ఉండొచ్చు. కానీ ఓ వింత ఇల్లు డోర్లు మాత్రం ఓ డోర్ ఓ రాష్ట్రంలోకి తెరుచుకుంటూ మరో డోర్ మరో రాష్ట్రంలోకి తెరుచుంటుంది…!! ఈ వింత ఇల్లు ఇప్పుడు పెద్ద చర్చనీంశంగా మారి అత్తా కోడళ్లు ఇద్దరు కలిసి ఉండే ఈ ఇంటిని వేరు చేసింది. ఇంటి మధ్యన గోడ కట్టేసింది. దీంతో ఒక రెండు రాష్ట్రాల్లో నిలబడి మాట్లాడుకుంటున్నారు ఆ అత్తా కోడళ్లు. వింత ఇంటి కథలోకి వెళితే..

అది పంజాబ్, హర్యానా సరిహద్దులోని సిర్సా జిల్లా. ఈ జిల్లాలోని దుబ్వాలి పట్టణం పక్కనే ఉన్న ధర్మశాలలో ఉంది ఓ ఇల్లు ఆసక్తికరంగా మారింది. ఈ ఇంటి యజమాని 70 ఏళ్ల జగ్వంతి దేవి. జగ్వంతి దేవి ఇల్లు ఓ వింత ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగ్వంతి దేవి ఇల్లు తలుపులు రెండు రాష్ట్రాల్లో తెరుచుంటాయి. ఓ డోరు పంజాబ్‌ రాష్ట్రంలో తెరుచుకుంటే, మరొక తలుపులు హర్యానాలో తెరుచుకుంటుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..ఈ ఇంటిలో జగ్వంతి దేవితో పాటు ఆమె కొడుకు సురేంద్ర,కోడలు రీటా ఇంకా వారి పిల్లలు కలిసి జీవిస్తున్నారు. ఇలా జీవిస్తున్న జగ్వంతి దేవి కుటుంబం వారి ఇంటిని పెద్దగా విస్తరించుకున్నారు. అంతకుముందు ఉన్న ఇంటిని అలాగే ఉంచి దాన్నే ఇంకొంచెం విస్తరించి కట్టుకున్నారు. అలా విస్తరించి కట్టిన ఇల్లు పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. సంగం ఓ పంజాబ్ లో మరో సగం హర్యానాలో ఉంది. దీంతో పెద్ద చిక్కే వచ్చి పండింది. అదేమంటే..

దేశమైనా, రాష్ట్రమైనా,జిల్లా అయినా గ్రామమైనా, పంట పండే పొలమైనా సరే ఇలా ప్రతిచోటా సరిహద్దు అనేది ఉంటుంది. సరిహద్దు విషయంలో పెద్ద, పెద్ద గొడవలే అవుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో సరిహద్దుల కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదే 70 ఏళ్ల జగవంతి దేవి తన కుటుంబమంతో కలిసి ధర్మశాల పక్కనే ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఆమె ఇంటి గురించి ఇప్పుడు ఒక పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే, ఆ ఇంటి తలుపు ఒకటి పంజాబ్‌లో, మరొకటి హర్యానాలో తెరుచుకుంటూ రెండు రాష్ట్రాల్లో ఈ ఇల్లు ఉండటంతో ఈ ఇంటికి విద్యుత్ కనెక్షన్ కు హర్యానాలో ని బిజ్లి విట్రాన్ విద్యుత్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ ఇల్లు వివాదంగా మారింది. విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విషయంలో రెండు రాష్ట్రాల వారు మాకు కుదరదంటే మాకు కుదరదని చెప్పేశారు. దీంతో ఇంటి మధ్యలో గోడను నిర్మించారు. ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని పనుల కారణంగా ఇంట్లో నిట్టనిలువునా గోడ కట్టక తప్పలేదు. దీంతో గోడ మధ్యలో ఓ చిన్న రంథ్రం పెట్టుకుని కోడలు ఓ వైపు..అత్త ఓ వైపు నిలబడి మాట్లాడుకుంటున్నారు.

జగ్వంతి దేవి ఇంటి విస్తరణలో భాగంగా ఆమె నివాసంలో సగం ప్రాంతం హర్యానా రాష్ట్ర పరిధిలోకి వెళ్లింది. ఆమె మూడు నెలల క్రితం విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే..భూమి రిజిస్ట్రీ ఉర్దూలో ఉండటంతొ దీనిపై స్థానిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చేసేందేం లేక రిజిస్ట్రీని పంజాబీ భాషలోకి మార్చారు. అలా చేసినా కూడా పని సవ్యంగా జరగలేదు. దీంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా రిజిస్ట్రీ ఇంగ్లీషులో తయారుచేశారు. దీంతో తమ ఇంటికి కరెంట్ కనెక్షన్ పక్కా అనుకున్నారు. అయితే దీనిపై విద్యుత్ శాఖ మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఇల్లు రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉండటం వల్ల తాము సర్వీసు ఇవ్వలేమని తెలిపింది. బార్డర్ సరిహద్దు గోడను నిర్మించే వరకు కనెక్షన్ ఇవ్వమని స్పష్టం చేసింది.

అందువల్ల, జగవంతి దేవి ఇంటి మధ్యలో గోడను నిర్మించక తప్పలేదు. పంజాబ్ నుండి విడిపోయిన తరువాత హర్యానా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఇటువంటి సరిహద్దు వివాదాలు చాలానే జరిగాయి. ఈక్రమంలో జగ్వంతి దేవి ఇంటితో మరోసారి ఇష్యూ చర్చయానీయాంశం అయ్యింది. ఇంట్లో గోడ నిర్మించడంతో గోడకు అత్తగారు ఒకవైపు, కోడలు మరోవైపు నిల్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండటం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

కాగా..మన తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే.. తెలంగాణకు మహారాష్ట్రతో, ఏపీకి ఒడిశాతో వివాదాలున్నాయి. ఇక దేశాల సరిహద్దు వివాదాలు మనం ప్రతిరోజూ వింటూనే ఉన్నాం. మన దేశం పాకిస్తాన్‌, చైనా, ఆప్ఘనిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, భూటాన్‌ దేశాలతో సరిహద్దును పంచుకుంటూ ఉంది. పాకిస్తాన్‌, చైనాతో సరిహద్దు వివాదాలు ఎక్కువ. ఇక అర అంగుళం భూమిని వదులుకోవడానికి ఏ దేశం సిద్ధంగా లేదు. సరిహద్దుల్లో సైన్యాలు పహారా కాస్తూ ఉంటాయి. అనుక్షణం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ యుద్ధ వాతావరణం ఉంటుంది. కానీ కొన్ని దేశాల సరిహద్దులు మాత్రం విచిత్రంగా ఉంటాయి. అసలు అవి సరిహద్దులంటే ఎవరూ నమ్మలేనట్లుంటాయి. మయన్మార్‌ సరిహద్దుల్లో ఉన్న లోంగ్వా గ్రామం అలాంటి కోవలేకే చెందుతుంది. ఆ గ్రామం రెండు దేశ్లాలోనూ ఉంటుంది.అందులోనూ ఒక ఇళ్లు ప్రత్యేకంగా సరిహద్దు రేఖ మీదనే ఉంది. ఆ గ్రామానికి రెండు దేశాల పౌరసత్వమూ ఉంటుంది. దీంతో వాళ్లు ఇరుదేశాలు అందజేసే పథకాలను అనుభవిస్తున్నారు. ఇలాంటి విచిత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లోను ఉన్న విషయం తెలిసిందే.