థానేలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్రలోని థానేలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్‌ కంపెనీలో అకస్మాతుగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.

థానేలో భారీ అగ్నిప్రమాదం

A huge accident in Thane : మహారాష్ట్రలోని థానేలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. ఓ ప్లాస్టిక్‌ కంపెనీలో అకస్మాతుగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో కంపెనీలోని ఉద్యోగులు భయంలో బయటకు పరుగులు తీశారు. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏకంగా 12 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.