Fire Broke Out : మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన వస్త్ర దుకాణాలు
మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్వాపార మేళాలో పదుల సంఖ్యలో దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.

Fire Broke Out : మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లో ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్వాలియర్ ఫెయిర్ పేరుతో జరుగుతున్న వ్వాపార మేళాలో పదుల సంఖ్యలో దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్, వస్త్ర దుకాణాలన్నీ మంటల్లో కాలిపోయాయి.
సుమారు కోటి యాభై లక్షల రూపాయల విలువైన వస్త్రాలు మంటల్లో కాలిపోయాయి. మొదట ఐదు, ఆరు నెంబర్ల దుకాణాల్లో మొదలైన మంటలు ఆ తర్వాత ఫెయిర్ మొత్తానికే అంటుకున్నాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో సహయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.