Husband Wife Dispute: భార్య తనను అడగకుండా స్వెట్టర్ ఉతికిందన్నకోపంతో ఇంటికి నిప్పంటించిన భర్త..

భార్య తనను అడగకుండా తనకు ఇష్టమైన స్వెట్టర్‌ను ఉతికిందన్న కోపంతో ఓ భర్త ఏకంగా ఇంటినే తగలబెట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న భార్య, చుట్టుపక్కల ప్రజలు తేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్దమైంది.

Husband Wife Dispute: భార్య తనను అడగకుండా స్వెట్టర్ ఉతికిందన్నకోపంతో ఇంటికి నిప్పంటించిన భర్త..

House Fire

Husband Wife Dispute: భార్య తనను అడగకుండా తనకు ఇష్టమైన స్వెట్టర్ ను ఉతికిందన్న కోపంతో ఓ భర్త ఏకంగా ఇంటినే తగలబెట్టుకున్నాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న భార్య, చుట్టుపక్కల ప్రజలు తేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్దమైంది. ఈ సంచలన ఘటన పాట్నాలోని గాంధీమైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్ముహాని ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Watch viral video: యువతికి గుండు చేశాక భావోద్వేగంతో తానూ గుండు చేసుకున్న క్షౌరకుడు

పాట్నాలోని మైదాన్ పోలీస్ స్టేషన్ హెడ్ అరుణ్ కుమార్ ఈఘటన వివరాలను వెల్లడించారు. పీర్ముహాని ప్రాంతంలో భార్యాభర్త ఇద్దరు ఓ న్యాయవాది ఇంట్లో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. భర్త పేరు అమిత్. కొంతకాలంగా అతను మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి చికిత్స కూడా కొనసాగుతోంది. బుధవారం తనకు ఇష్టమైన స్వెట్టర్ ను భార్య ఉతికేందుకు నీళ్లలో నానబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న అమిత్ నన్ను అడగకుండా నా స్వెట్టర్ ఎందుకు నీళ్లలో వేశావు. నాకు అది కావాలని పట్టుబట్టాడు. స్వెటర్ ఉతకడానికి నీళ్లలో ఉంచానని, ఇప్పుడు ఇవ్వలేను అని భార్య అనడంతో కోపంతో ఊగిపోయిన అమిత్ తను అద్దెకు ఉంటున్న ఇంటికి నిప్పంటించాడు.

Viral Video: రోడ్డుపై పెన్నులు అమ్ముతున్న బాలిక ముఖంలో వెలుగులు నింపిన మహిళ

నిమిషాల వ్యవధిలోని మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. ఈ ఘటనతో అమిత్ భార్య, స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే స్థానిక ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలను అదుపు చేసేసరికి ఇంటిలో చాలా భాగం కాలిపోయింది. పోలీసులకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అయితే అమిత్ ను అదుపులోకి తీసుకున్నారు.