America: భారత్‌లోని అమెరికా పౌరులకు కీలక సూచన!

భారత్ లో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయా దేశాలు భారత్ లో ఉన్న తమ దేశ పౌరులకు సూచనలు జారీచేస్తున్నాయి. సురక్షితంగా ఉండాలని చెబుతున్నాయి. ఈ తరుణంలోనే అమెరికా తమ దేశ పౌరులను వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగిరావాలని కోరింది.

America: భారత్‌లోని అమెరికా పౌరులకు కీలక సూచన!

America

America:  భారత్ లో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయా దేశాలు భారత్ లో ఉన్న తమ దేశ పౌరులకు సూచనలు జారీచేస్తున్నాయి. సురక్షితంగా ఉండాలని చెబుతున్నాయి. ఈ తరుణంలోనే అమెరికా తమ దేశ పౌరులను వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగిరావాలని కోరింది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

కేసులు తీవ్రత అధికంగా ఉందని, పరీక్షలు సంబంధించిన మౌలిక సదుపాయాల కొరత ఉందని, ఆస్పత్రులు కూడా కోవిడ్ నాన్ కోవిడ్ రోగులతో నిండిపోయి ఉన్నాయని ఆ దేశ ప్రజలకు తెలిపింది. భారత్ లో వైద్యసదుపాయాలు పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి అమెరికా పౌరులు ఎదో ఒక విమానం పట్టుకొని స్వదేశానికి తిరిగి రావాలని సూచించారు.

ఇండియాలో కరోనా కేసుల ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 3.79లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. మహమ్మారి ధాటికి 3,645 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అమెరికా 32 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 3 కోట్ల 20 లక్షల మంది కరోనా బారిన పడగా, 580000 వేలమంది మృతి చెందారు. ఇప్పటికి ప్రతి రోజు 50 వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 28 తేదీ అమెరికాలో 54000 కరోనా కేసులు నమోదయ్యాయి.