Ex-Boyfriend Shot Girl: ప్రేమను తిరస్కరించిందని తుపాకీతో కాల్చిన ప్రేమోన్మాది .. మృత్యువుతో పోరాడుతున్న యువతి.. వీడియో వైరల్..

తన ప్రేమను తిరస్కరించిందని ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక రోడ్డుపై వెళ్తుండగా తుపాకీతో మెడపై కాల్చి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది.

Ex-Boyfriend Shot Girl: ప్రేమను తిరస్కరించిందని తుపాకీతో కాల్చిన ప్రేమోన్మాది .. మృత్యువుతో పోరాడుతున్న యువతి.. వీడియో వైరల్..

Ex-Boyfriend Shot Girl

Ex-Boyfriend Shot Girl: తన ప్రేమను తిరస్కరించిందని ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక రోడ్డుపై వెళ్తుండగా తుపాకీతో మెడపై కాల్చి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాజధాని పాట్నాలోని బ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రపురి ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  ప్రేమోన్మాది ఘాతుకానికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక కూరగాయాలు విక్రయించే వ్యక్తి కుమార్తె. తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించి నిందితుడికోసం గాలిస్తున్నారు.

Russia: పది మంది పిల్లల్ని కంటే పదమూడు లక్షలు.. రష్యా మహిళలకు పుతిన్ ఆఫర్

యువతి ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లో కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో అక్కడ ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే కొద్దికాలం తరువాత ఏదో విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థిని మరో కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లడం ప్రారంభించింది. కోపోద్రిక్తుడైన ఆమె మాజీ ప్రియుడు యువతిపై కాల్పులకు తెగబడ్డాడు.

బుధవారం సాయంత్రం బాలిక ఒంటరిగా వెళ్తున్నట్లు గమనించి ఓ సంచిలో తుపాకీ పెట్టుకొని ఆమె వెనుకాలే వెళ్లాడు. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని తుపాకీతో బాలిక మెడపై కాల్చాడు. దీంతో బాలికల అక్కడికక్కడే పడిపోవటంతో ప్రేమోన్మాది అక్కడి నుంచి పరరాయ్యాడు. ఇందుకు సంబంధించిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.