Agra Hospital : సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి..హృదయవిదారక దృశ్యం

Agra Hospital : సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి..హృదయవిదారక దృశ్యం

Up

Oxygen Cylinder : సార్ మా అమ్మ చచ్చిపోతుంది..అలా చేయకండి..అంటూ ఓ కొడుకు పడుతున్న బాధ అందరినీ కలిచివేస్తోంది. ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్న పోలీసుల వద్ద మోకాళ్లపై దండం పెడుతూ..అతను వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆక్సిజన్ కోసం రోగులు, వారి కుటుంబసభ్యులు పడుతున్న బాధలు ఎలా ఉన్నాయో ఈ ఘటనే చూపిస్తోంది. ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తల్లికి కరోనా సోకింది. ప్రైవేటు ఆసుపత్రిలో చేరిపించి చికిత్స చేయిస్తున్నాడు. అయితే..ఈ ప్రైవేటు ఆసుపత్రి నుంచి పోలీసుల బందోబస్తు మధ్య ఆక్సిజన్ సిలిండర్లు తరలిస్తున్నారు.

దీనిని తెలుసుకున్న ఆ వ్యక్తి ఆసుపత్రి బయటకు వచ్చి..మోకాళ్లపై నిల్చొని దండం పెడుతూ..ఆక్సిజన్స్ సిలిండర్లను తరలించవద్దని ప్రాథేయపడ్డాడు. ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళితే..తన తల్లి చనిపోతుందని, తాను ఆక్సిజన్ సిలిండర్లను ఎక్కడి నుంచి తీసుకరావాలని ప్రశ్నించాడు.

తన తల్లిని ఆరోగ్యంగా ఇంటికి తీసుకొస్తానని..తన కుటుంబసభ్యులకు మాటిచ్చానని..దయచేసి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్లవద్దని మోకాళ్లపై కూర్చొని..దండం పెడుతూ..ప్రాథేయపడ్డాడు. కానీ..పోలీసులు మాత్రం తమ పనిలో బిజీగా ఉన్నట్లు కనిపించారు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ ను తీయ‌వ‌ద్ద‌ని పోలీసుల‌ను వేడుకోవ‌డం కండ్లు చ‌మ‌ర్చేలా ఉంద‌ని, యూపీ పోలీసుల తీరు అమాన‌వీయ‌మ‌ని ఈ వీడియోను ట్విట‌ర్ లో పోస్ట్ చేస్తూ యూత్ కాంగ్రెస్ యోగి స‌ర్కార్ పై విమర్శలు చేసింది.

Read More : Gorakhpur : ప్రోనింగ్ టెక్నిక్..కరోనాను జయించిన 82 ఏండ్ల మహిళ