Man Killed Woman : ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి

ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. మృతదేహాన్ని గదిలో దాచి ఇంటికి తాళం వేసి పంజాబ్ లోని స్వస్థలానికి పారిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Man Killed Woman : ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి

Man Killed Woman : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. మృతదేహాన్ని గదిలో దాచి ఇంటికి తాళం వేసి పంజాబ్ లోని స్వస్థలానికి పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్ కు చెందిన మన్ ప్రీత్ సింగ్, ఢిల్లీకి చెందిన రేఖారాణి 2015 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలోని రేఖారాణి ఇంట్లోనే ఆమె 15 ఏళ్ల కుమార్తెతో మన్ ప్రీత్ సింగ్, రేఖారాణి కలిసి ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న మన్ ప్రీత్ రేఖారాణి కుమార్తెకు మత్తు మందు ఇచ్చి రేఖారాణిని హత్య చేశాడు. మృతదేహాన్ని ఒక గదిలో దాచి తాళం వేశాడు. రేఖారాణి కుమార్తె మత్తు నుంచి తేరుకుని తల్లి కో్సం ఆరా తీయగా మార్కెట్ కు వెళ్లినట్లు మన్ ప్రీత్ చెప్పాడు. అతని తీరును అనుమానించిన కుమార్తె తన బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.

Assam: మహిళ హత్య.. నిందితుడిని కాల్చి చంపిన గ్రామస్తులు

ఇంతలోనే మన్ ప్రీత్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో మృతురాలి కుమార్తె, బంధువులు రేఖారాణి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఇంట్లో తాళం వేసిన ఉన్న రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా ఆమె విగతజీవిగా పడివుంది.

దీంతో నిందితుడి కోసం పోలీసులు ట్రేస్ చేయగా పంజాబ్ లోని స్వస్థలంలో ఉన్నట్లు తేలింది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో హత్య విషయం వెలుగు చూసింది.