ఓ తండ్రి దీనావస్థ..కుమార్తె మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కి.మీ కాలినడక

చ‌నిపోయిన కుమార్తెను ఒక తండ్రి మంచంపై ఏడు గంట‌లు మోసి 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి పోస్ట్‌మార్టం కోసం తీసుకెళ్లాడు.

ఓ తండ్రి దీనావస్థ..కుమార్తె మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కి.మీ కాలినడక

A Man Was Forced To Carry His Daughters Body On A Cot For Post Mortem For 35 Km

daughter’s body చ‌నిపోయిన కుమార్తెను ఒక తండ్రి మంచంపై ఏడు గంట‌లు మోసి 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి పోస్ట్‌మార్టం కోసం తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిలాల్లో ఈ హృదయవిదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది.

సింగ్రౌలి జిల్లా గడాయి గ్రామానికి చెందిన ధీరపతి సింగ్ గోండ్‌ కూతురు ఈ నెల 5న ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి యువతి మృతదేహానికి జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయాల్సి ఉందని, అక్కడికి తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయారు. అయితే హాస్పిటల్ సుమారు 35 కి.మీ. దూరంలో ఉంది. అయితే నిరుపేద అయిన ధీరపతి సింగ్ గోండ్‌ కు.. తన కూతురు డెడ్ బాడీని తరలించేందుకు ఏ వాహనాన్నీ సమకూర్చుకోలేకపోయాడు. వాహ‌నం స‌మ‌కూర్చేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు.

అధికారులు కూడా తాము వాహనాన్ని ఏర్పాటు చేయలేమని, అది నువ్వే చూసుకోవాలని చెప్పి చేతులెత్తేశారు. దీంతో మరునాడు ఈ తండ్రి తన కుమార్తె డెడ్ బాడీని మంచంపై వేసుకుని కాలినడకన బయల్దేరాడు. మంచంపై కుమార్తె మృత‌దేహాన్నిఉంచి కొంద‌రు గ్రామ‌స్తుల‌తో క‌లిసి ఉదయం 9 గంటలకు బయల్దేరి ఏడు గంట‌లు మోసి 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రికి తీసుకెళ్లాడు. ఒక వ్య‌క్తి త‌న మొబైల్‌లో ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది. ఈ వీడియో ఎంతో దయనీయంగా ఉందని, ఆ నిర్భాగ్య పేద తండ్రికి ఎన్ని కష్టాలువచ్చాయని నెటిజన్లు వాపోతున్నారు. కాగా, స్థానిక పోలీస్ అధికారి అరుణ్ సింగ్ దీనిపై స్పందించారు. మృత‌దేహాల‌ను పోస్ట‌మార్టం కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డానికి త‌మ వ‌ద్ద బ‌డ్జెట్ లేద‌ని తెలిపారు. అందుకే వాహ‌నం స‌మ‌కూర్చ‌లేద‌ని ఆయ‌న తెలిపారు.