Covid‌ Vaccine : పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి కొవిడ్‌ టీకాతో కోలుకున్నాడు

అంతకుముందు మాటలు రాని అతడికి టీకా వేసుకున్న తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు. చచ్చుబడిన కాళ్లు కూడా పనిచేయడం మొదలెట్టాయి. దీంతో అతను ఇప్పుడు లేచి నడుస్తున్నాడు.

Covid‌ Vaccine : పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి కొవిడ్‌ టీకాతో కోలుకున్నాడు

Vaccine (1)

man Suffering from paralysis : కరోనా టీకా ఓ వ్యక్తికి వరంగా మారింది. వ్యాక్సినేషన్‌లో అద్భుతం జరిగింది. నాలుగేళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆ వ్యక్తి కొవిడ్‌ టీకాతో కోలుకున్నాడు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అతడి కాళ్లలో కదలిక రావడంతో పాటు మాటలు స్పష్టంగా వచ్చాయి. ఈ వింత ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.

బొకారోలోని సల్గాడిహ్ గ్రామానికి చెందిన దులార్‌చంద్ పక్షవాతం కారణంగా సుమారు 4 ఏళ్లుగా మంచంపైనే ఉన్నాడు. అప్పటినుంచి అతడి మాటకూడా పడిపోయింది. అయితే అతడు ఇటీవల కరోనా టీకా తీసుకున్నాడు. వైద్యసిబ్బంది దులార్‌చంద్‌కు కోవిషీల్డ్ టీకా మొదటి డోస్ వేశారు. ఆ తర్వాత అతడి శరీరంలో మార్పులు మొదలయ్యాయి.

Sankranthi : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు

అంతకుముందు మాటలు రాని అతడికి టీకా వేసుకున్న తర్వాత మాట్లాడడం ప్రారంభించాడు. చచ్చుబడిన కాళ్లు కూడా పనిచేయడం మొదలెట్టాయి. దీంతో అతను ఇప్పుడు లేచి నడుస్తున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్నందుకు ఆనందంగా ఉందన్నాడు దులార్‌చంద్‌. జనవరి 4న వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి తనలో మార్పు వచ్చిందని చెప్పాడు.

మరోవైపు ఈ సంగతి తెలుసుకున్న డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాలుగు ఏళ్లుగా పక్షవాతంతో ఉన్న వ్యక్తి టీకా తీసుకున్న తర్వాత అకస్మాత్తుగా కోలుకోవడం నమ్మశక్యంగా లేదన్నారు. శాస్త్రీయంగా దీనిని నిర్ధారించాల్సి ఉందని చెప్పారు.