Man Hit Traffic Policeman : చలాన్ చెల్లించాలన్న ట్రాఫిక్ పోలీస్.. కారుతో ఢీకొట్టి 4 కిమీ ఈడ్చుకెళ్లిన వ్యక్తి

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. చలాన్ చెల్లించాలన్న ట్రాఫిక్ పోలీస్ ను కారుతో ఢీకొట్టి 4 కిమీ ఈడ్చుకెళ్లాడు. ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతున్న వ్యక్తిని సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసు ఆపారు.

Man Hit Traffic Policeman : చలాన్ చెల్లించాలన్న ట్రాఫిక్ పోలీస్.. కారుతో ఢీకొట్టి 4 కిమీ ఈడ్చుకెళ్లిన వ్యక్తి

MAN HIT POLICE

Man Hit Traffic Policeman : మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. చలాన్ చెల్లించాలన్న ట్రాఫిక్ పోలీస్ ను కారుతో ఢీకొట్టి 4 కిమీ ఈడ్చుకెళ్లాడు. ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతున్న వ్యక్తిని సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసు ఆపారు. దీంతో చలాన్ తప్పించుకునేందుకు అతను పోలీసును ఢీ కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసు అధికారి కారుకు అడ్డంగా నిలవడమే కాకుండా బ్యానెట్ పై ఎక్కాడు.

అయినా ఆ వ్యక్తి కారును ఆపకుండా నడుపుతూ వెళ్లాడు. పోలీసు కింద పడిపోవాలని
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారును వేగంగా అటూ ఇటూ తిప్పాడు. అంతటితో ఆగకుండా
కారు బ్యానెట్ పై ఉన్న పోలీసును ఏకంగా 4 కిలో మీటర్లు లాక్కెల్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bhopal : వాహనాన్ని తీసుకెళ్లాడని ట్రాఫిక్ ఎస్ఐపై దాడి..దారుణంగా కత్తితో పొడిచాడు

విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసు పేరు శివ సింగ్ చౌహాన్ కాగా, కారు నడిపిన వ్యక్తిని గ్వాలియర్ కు చెందిన కేవశ్ ఉపాధ్యాయ్ గా గుర్తించారు. ‘కారు నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని ఆపి, జరిమానా చెల్లించమని అడిగాను. కానీ అతను చలాన్ చెల్లించేందుకు నిరాకరించాడు. పైగా అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.

దీంతో నేను అతని కారు బ్యానెట్ పై ఎక్కాను. నన్ను అలాగే 4 కిలో మీటర్ల వరకు లాక్కెళ్లాడు’ అని ట్రాఫిక్ పోలీసు శివ సింగ్ చౌహాన్ వెల్లడించారు. అనుమానం రావడంతో అతని కారును చెక్ చేయగా తుపాకీ, తూటాలు దొరినట్లు పేర్కొన్నారు.