Kerala : కరోనా బాధిత కుటుంబాలకు నెలకు రూ.5వేలు పెన్షన్

కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Kerala : కరోనా బాధిత కుటుంబాలకు నెలకు రూ.5వేలు పెన్షన్

Kerala

Kerala : కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది అందాలుగా మిగిపోయారు. మరికొందరు కుటుంబ సభ్యులను కోల్పోయి ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఇంటి వారిని దృష్టిలో ఉంచుకొని కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మహమ్మారితో మరణించిన నిరుపేద కుటుంబాలకు నెలకు 5వేల రూపాయల చొప్పున మూడేళ్ల పాటు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

చదవండి : Kerala’s Covid Cases : కేరళలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు

కోవిడ్ మృతుల్లో దారిద్ర్య రేఖను దిగువన కుటుంబాలకు ఆదుకునేందుకు ఈ అదనపు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేరళ వసూలు ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో మరణించినా ఈ పెన్షన్ అందిస్తామని సీఎం తెలిపారు. వారు బీపీఎల్ కేటగిరి అయి ఉండాలని వివరించారు. కరోనాతో మరణించిన వారి పిల్లలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

చదవండి : Kerala Couple World Tour: చిన్న టీ కొట్టుతో జీవనం..ప్రపంచయాత్ర చేస్తున్న వృద్ధ దంపతులు..ఈసారి ఏదేశమంటే..

ఇక ఇదిలా ఉంటే కేరళలో కరోనా కేసుల తీవ్ర అధికంగా ఉంది. ప్రతి రోజు 10 వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో కేరళలో 60 శాతం కేసులు వెలుగు చూస్తున్నాయి. కేరళలో కరోనా కేసుల తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. కానీ చిన్న రాష్ట్రమైన కేరళలో మాత్రం కేసుల తీవ్రత తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది.