Airplane passenger heart attack : విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి రెండుసార్లు గుండె పోటు.. ప్రాణాలు కాపాడిన భారత సంతతి వైద్యుడు

విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రెండు సార్లు గుండె పోటు రావడంతో భారత సంతతి వైద్యులు కాపాడారు. 10 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణంలో వ్యక్తి గుండె రెండు సార్లు ఆగిపోయింది. కార్డియాక్ అరెస్టు అయి స్పృహ కోల్పోయిన ప్రయాణికుడి ప్రాణాలను భారత సంతతి డాక్టరు కాపాడారు.

Airplane passenger heart attack : విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి రెండుసార్లు గుండె పోటు.. ప్రాణాలు కాపాడిన భారత సంతతి వైద్యుడు

AIRPLANE

Airplane passenger heart attack : విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి రెండు సార్లు గుండె పోటు రావడంతో భారత సంతతి వైద్యులు కాపాడారు. 10 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణంలో వ్యక్తి గుండె రెండు సార్లు ఆగిపోయింది. కార్డియాక్ అరెస్టు అయి స్పృహ కోల్పోయిన ప్రయాణికుడి ప్రాణాలను భారత సంతతి డాక్టరు కాపాడారు. బర్మింగ్ హామ్ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన హెపటాలజిస్ట్ డా.విశ్వరాజ్ వేమల తన తల్లిని యూకే నుంచి బెంగళూరుకు విమానంలో తీసుకెళ్తున్నారు.

అయితే అదే విమానంలో ఓ ప్రయాణికుడు(43) కార్డియాక్ అరెస్టుకు గురయ్యాడు. విమాన సిబ్బంది పిలుపుతో వెంటనే డా.విశ్వరాజ్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. విమాన క్యాబిన్ సిబ్బంది వద్ద మెడికల్ కిట్ లో ఆక్సిజన్, ఆటో మేటెడ్ ఎక్స్ టర్నల్ డీఫిబ్రిలేటర్ మాత్రమే ఉన్నాయి.

Heart Attack : కువైట్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

మిగిలిన ప్రయాణికుల దగ్గర నుంచి హార్ట్ రేట్ మానిటర్, బీపీ మెషీన్, పల్స్, ఆక్సిమీటర్, గ్లూకోజ్ మీటర్ తీసుకొని ఆ వ్యక్తి పరిస్థితిని పరిశీలించారు. అయితే రెండో సారి కూడా ఆ వ్యక్తి కార్డియాక్ అరెస్టుకు గురయ్యారు. అయినా విశ్వరాజ్ పట్టువీడకుండా మిగతా ప్రయాణికుల సహకారంతో తీవ్రంగా శ్రమించి అతడిని స్పృహలోకి తీసుకొచ్చాడు.

మళ్లీ గుండె కొట్టుకునేలా చేసి, అతని ప్రాణాలు కాపాడారు. ఐదు గంటలపాటు ఆ వ్యక్తి స్పృహలో ఉండేటట్లు చూశారు. ప్రయాణికుడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేశారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఎమర్జెన్సీ సిబ్బందికి వ్యక్తిని విశ్వరాజ్ ప్రాణాలతో అప్పగించారు.