Rare Coin: ఈ రూపాయి విలువ రూ.కోటి.. మీ దగ్గర కూడా ప్రత్యేకమైన నాణేలు ఉన్నాయా?

డబ్బు సంపాదించడానికి అవకాశం ఎవరు కోరుకోరు? మీ దగ్గర ప్రత్యేకమైన రూ.1 నాణెం, రూ.5 లేదా రూ.10 నాణెం ఉందా? అవి ఈ రోజు చెలామణిలో లేవు కానీ, మీకు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం కల్పిస్తాయి.

Rare Coin: ఈ రూపాయి విలువ రూ.కోటి.. మీ దగ్గర కూడా ప్రత్యేకమైన నాణేలు ఉన్నాయా?

Coin

Crore Coin: డబ్బు సంపాదించడానికి అవకాశం ఎవరు కోరుకోరు? మీ దగ్గర ప్రత్యేకమైన రూ.1 నాణెం, రూ.5 లేదా రూ.10 నాణెం ఉందా? అవి ఈ రోజు చెలామణిలో లేవు కానీ, మీకు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం కల్పిస్తాయి. అయితే, ఈ నాణేలు చాలా అరుదుగా ఉండాలి.

ఉదాహరణకు, 1885 సంవత్సరంలో బ్రిటీష్ పాలనలో రూ.1 నాణెం ముద్రించడింది. ఆ నాణెం విలువ ఇప్పుడు రూ.కోటి, ఈ కాయిన్‌ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిపై విక్టోరియా మహారాణి చిత్రం ఉంది. దాంతో పాటుగా బ్రిటిష్‌ కింగ్‌ జార్జ్‌-5 చిత్రం కాయిన్‌ ఉన్న అరుదైన కాయిన్‌కు కూడా ఆన్‌లైన్‌లో కోటి రూపాయాలు పొందవచ్చు అని చెబుతున్నారు.

ఇండియమార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో, మీరు ఈ అరుదైన నాణేల చిత్రాన్ని అప్‌లోడ్ చేయవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మొదట, మీరే సైట్‌లో మీ పేరును నమోదు చేసుకోవాలి, ఆపై ఆన్‌లైన్ చర్చల కోసం మీ నాణేలను క్లారిటీగా ఫోటో తీసి అందులో పెట్టాలి.

అది అరుదైన కాయిన్‌ అయితే న్యూమిస్మాటిక్స్‌ మిమ్మల్ని సంప్రదిస్తారు. అరుదైన కాయిన్స్‌ను, నోట్లను సేకరించే వారిని న్యూమిస్మాటిక్స్‌ అంటారు. వీరు అరుదైన కాయిన్లను, నోట్లను సేకరించి, ఆనాటి బౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేస్తారు. అందువల్లే ఆన్‌లైన్‌లో వారికి నచ్చిన అరుదైన కాయిన్స్‌ను కొనుగోలు చేయడానికి ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధపడుతారు. ఇందులో ఎక్కువగా విదేశీయుల ప్రభావం ఉంటుంది.

నాణేల చక్కని మరియు స్పష్టమైన చిత్రాన్ని అప్‌లోడ్ చేయడం ద్వారా మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలంటే?

మొదట మీరు సైట్‌లో ఆన్‌లైన్ విక్రేతగా నమోదు చేసుకోవాలి.
అప్పుడు, నాణెం ఫోటోను ముందు మరియు వెనుక వైపున క్లిక్ చేసి, దానిని సైట్‌లో అప్‌లోడ్ చెయ్యాలి.
మీ జాబితాను స్పష్టంగా చూడటానికి కొనుగోలుదారులకు సైట్ అనుమతిస్తుంది.

అయితే, ఇటీవలికాలంలో కాయిన్‌ల పేరుతో మోసాలు కూడా జరుగుతున్నాయి.. జాగ్రత్తగా చూసి స్పందించడం బెటర్.