Covid Second Wave: కొవిడ్ అంధకారంలో తళుక్కుమన్న ఆశా కిరణం.. ఇన్ఫెక్షన్ వ్యాప్తి తగ్గుతుందలా

రెండు వారాలుగా కరోనా వ్యాప్తి తగ్గుతూ ఉందని రికార్డులు చెప్తున్నారు. ఫిబ్రవరి నెల మధ్యలో 1.38గా ఉన్న వ్యాప్తి..

Covid Second Wave: కొవిడ్ అంధకారంలో తళుక్కుమన్న ఆశా కిరణం.. ఇన్ఫెక్షన్ వ్యాప్తి తగ్గుతుందలా

A Ray In Covid Dark Cases Dip In Mumbai Curve Shows Plateau In Maharashtra

Covid Second Wave: కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కేసులు పెరుగుతుండటమే కానీ, ఏ రోజూ కాస్త ఉపశమనమైనా లేకుండా సంఖ్య పెరుగుతూనే ఉంది. మహారాష్ట్ర కేసుల విషయంలో దేశంలోనే పీక్స్ లో ఉంది. రెండు వారాలుగా రోజూ సుమారు 60వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెల మధ్యలో మొదలైన కొవిడ్ వేవ్ ఎఫెక్ట్ అస్సలు తగ్గకుండా దూసుకెళ్లింది.

ప్రత్యేకించి రెండు వారాలుగా కరోనా వ్యాప్తి తగ్గుతూ ఉందని రికార్డులు చెప్తున్నారు. ఫిబ్రవరి నెల మధ్యలో 1.38గా ఉన్న వ్యాప్తి ప్రస్తుతం 1.13కి చేరింది. చెన్నైలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాథమాటికల్ సైన్సైస్ సైంటిస్టుల టీం అనాలసిస్ ను బట్టి రిపోర్టులు ఇలా ఉన్నాయి.

ఇన్ఫెక్షన్ వ్యాప్తి రేటు తగ్గడానికి కారణం ఆల్రెడీ ఇన్ఫెక్షన్ గురైన వ్యక్తికి మరో సారి ఇన్ఫెక్షన్ ఎదుర్కొంటూ ఉండటమే. 1.38గా ఉందంటే ఇన్ఫెక్షన్ కు గురైన 100మంది 138మందికి వ్యాప్తి చేసేవారని.. అది ఇప్పుడు 113కు తగ్గిందని చెప్తున్నారు. గతంతో పోలిస్తే వారం రోజులుగా జరుగుతున్న వ్యాప్తి తక్కువగా ఉంది. దీనిని బట్టి చూస్తూ వ్యాప్తి తగ్గిపోతుందనే అంటున్నారు అధికారులు.

శనివారం నమోదైన కొత్త ఇన్ఫెక్షన్లు 5వేల 867గా ఉండగా ఈ నెల మొత్తంలో అతి తక్కువ కేసుల నమోదు అని రికార్డులు చెబుతున్నాయి.

దేశంలో కరోనా వ్యాప్తిలో మహారాష్ట్రనే ప్రథమంగా ఉంది. సెకండ్ వేవ్ లో అత్యంత వేగంగా కేసుల నమోదు జరుగుతుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో వ్యాప్తి తగ్గుతుండగా దేశంలో కేసుల నమోదు కూడా తగ్గినట్లే చెప్పొచ్చు. మూడు వారాలుగా ఇదే పరిస్థితి కనిపిస్తుండగా.. మార్చి వరకూ చూస్తే దేశంలో 60శాతం కేసులు ఇక్కడి నుంచే నమోదయ్యాయి.