Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో పట్టపగలు దుశ్శాసన పర్వం.. ఆదివాసీ మహిళలను లైంగికంగా వేధించిన అల్లరిమూక

మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ..భగోరియా. ఆదివాసీ సంస్కృతికి, వైభవానికి ప్రతీక ఈ ఉత్సవం. ఈ ఉత్సవాల్లోనే ఆదివాసీ మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లింది.

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో పట్టపగలు దుశ్శాసన పర్వం.. ఆదివాసీ మహిళలను లైంగికంగా వేధించిన అల్లరిమూక

Madhyapradesh

sexually harassed tribal women : అది అర్ధరాత్రి కాదు.. పట్టపగలు. నిర్మానుష్య ప్రాంతం అంతకన్నా కాదు.. గిరిజనులంతా గూమికూడి అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంటున్న ఉత్సవం.. అయినా అదరలేదు.. బెదరలేదా బేవార్స్‌ బ్యాచ్‌. చుట్టూ వందలాది మంది ఉన్నారన్న భయం లేకుండా ఊరకుక్కల్లా మీద పడ్డారు. ఆదివాసీ మహిళలంటే అంగట్లో అప్పనంగా దొరికే సరుకున్నారో లేక ఏం చేసినా చెల్లుతుందనుకున్నారో తెలీదు కానీ.. ఓ అల్లరి మూక ఆదివాసీ మహిళలతో అత్యంత నీచంగా ప్రవర్తించింది.

భగోరియా ఉత్సవాలు.. మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. ఆదివాసీ సంస్కృతికి, వైభవానికి ప్రతీక ఈ ఉత్సవం. కానీ ఈ ఉత్సవాల్లోనే ఆదివాసీ మహిళల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లింది.. అది కూడా నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే ఆదివాసీ మహిళలను లైంగికంగా వేధించింది ఓ అల్లరి మూక. నడిరోడ్డుపైనే దుశ్శాసన పర్వాన్ని చూపించింది ఆ ఊరకుక్కల బ్యాచ్‌. ప్రతిఘటించే శక్తి లేక వారు పెట్టిన కేకలు.. ఆరణ్యరోదనే అయ్యాయి కానీ వారినాదుకునేందుకు ఏ కృష్ణుడు ముందుకు రాలేదు.

Eve-Teaser : మహిళపై లైంగిక వేధింపులు… చెప్పుల దండతో నిందితుడ్ని ఊరేగించిన గ్రామస్తులు

ఇంత జరుగుతున్నా చుట్టూ ఉన్న జనం చూస్తూనే ఉన్నారు.. ఈ ఊరకుక్కలు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు.. కళ్ల ముందు జరుగుతున్న ఈ అమానుషాన్ని ఎవరూ ఆపలేదు.. అడ్డుకోలేదు సరికదా వేడుక చూశారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియోను ట్రైబల్‌ ఆర్మీ వెలుగులోకి తెచ్చింది.

వెరిఫైడ్ ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆదివాసీ మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదేనా మీరు ఆదివాసీలకు ఇచ్చే విలువా అంటూ ప్రశ్నిస్తోంది? ఆ అల్లరి మూకను పట్టుకొని తగిన శిక్ష విధించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది ఇప్పుడు. మరి మధ్యప్రదేశ్‌ సర్కార్‌ ఏం చేస్తుందో చూడాలి.