Union Budget 2023: అందుకే ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపులు ఇచ్చారు: ‘సామ్నా’లో విమ‌ర్శ‌లు

కేంద్ర ప్ర‌భుత్వం నిన్న‌ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ పై మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేకు చెందిన శివ‌సేన ప‌త్రిక సామ్నాలో తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఓ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు, ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయాయ‌ని ఈ విష‌యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికే ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపులు ఇవ్వాల‌ని కేంద్ర స‌ర్కారు ప్ర‌ణాళిక వేసుకున్న‌ట్లుంద‌ని చెప్పారు.

Union Budget 2023: అందుకే ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపులు ఇచ్చారు: ‘సామ్నా’లో విమ‌ర్శ‌లు

#UnionBudget2023

Union Budget 2023: కేంద్ర ప్ర‌భుత్వం నిన్న‌ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ పై మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేకు చెందిన శివ‌సేన ప‌త్రిక సామ్నాలో తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఓ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు, ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయాయ‌ని ఈ విష‌యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికే ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపులు ఇవ్వాల‌ని కేంద్ర స‌ర్కారు ప్ర‌ణాళిక వేసుకున్న‌ట్లుంద‌ని చెప్పారు.

క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలోనే ఆ రాష్ట్రానికి కేంద్రం బ‌డ్జెట్ లో ప్ర‌త్యేక కేటాయింపులు చేసింద‌ని సామ్నా ఆరోపించింది. ఇది ఎన్నికల ముందు ప్ర‌వేశ పెట్టిన‌ బడ్జెట్ అని, త‌దుప‌రి లోక్ స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు మ‌త్తుమందు ఇచ్చిన‌ట్లు ఉంద‌ని సామ్నా పేర్కొంది.

ఆదాయప‌న్ను మిన‌హాయింపుల‌ విష‌యంలో దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత ఆర్థిక శాఖ మంత్రి ప్ర‌క‌ట‌న చేశార‌ని చెప్పింది. ఎన్డీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధ‌ర‌లు రెండు రెట్లు పెరిగిపోయాయ‌ని, వాటితో పోల్చి చూసుకుంటే కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపులు ప్ర‌జ‌ల‌కు ఇచ్చే ప‌రిహారానికి కూడా స‌రిపోవ‌ని సామ్నా ఎద్దేవా చేసింది.

Fire accident in Hyderabad: హైద‌రాబాద్ లో భారీ అగ్ని ప్ర‌మాదం.. నాలుగు ఫైరింజ‌న్ల‌తో మంట‌లు ఆర్పుతున్న సిబ్బంది