selfe with goat :మేకతో సెల్ఫీ అంత ఈజీ కాదు..దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందిగా..

selfe with goat :మేకతో సెల్ఫీ అంత ఈజీ కాదు..దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందిగా..

A Selfe With A Goat

A selfe with A goat Shocking Viral Video: సెల్ఫీలు పిచ్చి ఉన్నవాళ్లు ఏది కనిపించినా..మూతి మూడు వంకర్లు పెడుతూ సెల్ఫీలు దిగేస్తారు. అలా ఓ యువతికి మేకతో సెల్ఫీ దిగాలనుకుంది. అనుకున్నదే తడవుగా…ఫోన్ ను పైకెత్తి షాట్ సెట్ చేసుకుంటోంది. కానీ మేక మాత్రం అటూ ఇటూ కదులుతూంటే షాట్ సెట్ చేసుకునేలోగా ఆ మేక కాస్తా ‘ ఏంటో నీ ఏసాలు..అనుకుందేమో..వెనక్కి వెళ్లి ముందుకొచ్చి ఆమెను ఒక్క కుమ్ము కుమ్మింది.దీంతో పాపం సెల్ఫీ షాట్ మాట ఏమోగానీ..ఆమెగారికి తల బొప్పి కట్టింది.దీంతో ఏమి అర్థం అవుతోందీ? మేకతో సెల్ఫీ అంత ఈజీ కాదు అనిపిస్తుంది..

మేకతో సెల్ఫీ దిగాలనుకునే అమ్మాయి బహుశా సిటీలో ఉంటూ… పండుగకో లేదా..పెళ్లికో పల్లెటూరికి వెళ్లి ఉంటుంది. అక్కడ తాడుతో కట్టేసి ఉన్న మేకతో సెల్ఫీ దిగాలనుకుంది. తాడుతో కట్టి వున్న ఎక్కడికీ వెళ్లదు. కుదురుగా ఓ చోట ఉంటుంది. కాబట్టి సెల్ఫీ బాగా వస్తుంది అనుకుందేమో. అనుకున్నదే తడవుగా..షాట్ రెడీ చేసుకుంటోంది. వీడియో కూడా తీసుకోవాలనుకుంది.

ఆమె సెల్ఫీ కోసం మొబైల్ కెమెరాను ఆన్ చెయ్యగానే… మేక అటూ ఇటూ కదలడం మొదలుపెట్టింది. దాంతో ఆమె సెల్ఫీ వీడియో తీసుకుందామని నానా తండాలు పడింది. అందులో మేక కదులుతుంటే… తన వీడియో బాగా వస్తోందని ఆనందపడుతూ… నవ్వుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటోంది. కానీ ఆ మేక ఆమెకు షాక్ ఇచ్చింది.

అది ముందుకూ, వెనక్కూ కదులుతూ… ఒక్కసారిగా వెనక్కి వెళ్లి ఫాస్టుగా ముందుకొచ్చి పైకి ఉరికి… తలతో గట్టిగా ఒక్కగుద్దు గుద్దింది. లక్కీగా మేకకు కొమ్ములు లేవు కాబట్టి కొద్దిపాటి దిమ్మతిరిగి బైటపడింది. లేదంటే తలకు కుట్లు వేయించుకోవాల్సి వచ్చేదేమో..కాబట్టి మేకతోను..గొర్రెలతోను ముఖ్యంగా కొమ్ములున్నవాటితో ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలి.

లేదంటే ఇటువంటి ఘటనలు తప్పవు..మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ ఈ మేక సెల్ఫీ మీద..చూశారుగా… అదీ పరిస్థితి. మేక గుద్దిన గుద్దుకు ఆమె చేతిలో సెల్‌ఫోన్ ఎగిరి కింద పడింది. ఆమె షాకైంది. ఆ మేకను తాడుతో కట్టేసి ఉంది. దీంతో దానికి పిచ్చికోపంలో ఉంది. కుమ్మేయటనికి ఎవరు దొరుకుతారా ఎదురు చూస్తుండగా ఈ సెల్ఫీ బకరా వెళ్లి బుక్కైంది. ఈ వీడియో వైరల్ అయ్యింది. 6 లక్షల మందికి పైగా దీన్ని చూశారు.