Snake In Woman Ear : మహిళ చెవిలోకి దూరిన పాము

ఓ మహిళ చెవిలోకి పాము దూరింది. దానిని ఆమె చెవి నుంచి తీసేందుకు డాక్టర్‌ తెగ ప్రయత్నించాడు. ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిన ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్‌ అయ్యారు.

Snake In Woman Ear : మహిళ చెవిలోకి దూరిన పాము

snake in woman ear

Snake In Woman Ear : ఓ మహిళ చెవిలోకి పాము దూరింది. దానిని ఆమె చెవి నుంచి తీసేందుకు డాక్టర్‌ తెగ ప్రయత్నించాడు. ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిన ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్‌ అయ్యారు. చందన్ సింగ్ అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘చెవి లోపలకు పాము వెళ్లింది’ అని క్యాప్షన్ ఇచ్చాడు. కాగా, చేతులకు గ్లౌజ్‌లు వేసుకున్న డాక్టర్‌ ఫోర్‌సెప్స్‌తో నోరు తెరిచిన ఆ పామును మహిళ చెవి నుంచి బయటకు లాగేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు.

ఈ వీడియో క్లిప్‌ అసంపూర్తిగా ముగియడంతో ఆ మహిళ చెవిలో దూరిన చిన్న పామును డాక్టర్‌ బయటకు తీశాడా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. అలాగే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్నది కూడా తెలియలేదు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Snake Gets Stuck In Ear: అమ్మాయి చెవిలో దూరిన సన్నపాటి పాము..? వీడియో వైరల్

ఇప్పటికే సుమారు లక్ష మంది దీనిని వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఆ మహిళ చెవిలోకి పాము ఎలా దూరిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫేక్‌ వీడియో అని కొందరు ఆరోపించారు. పూర్తి వీడియోను పోస్ట్‌ చేయాలని ఆ యూజర్‌ను మరి కొందరు కోరడం గమనార్హం.