Congress Marathon : కాంగ్రెస్ మారథాన్‌లో తొక్కిసలాట.. ముగ్గురికి గాయాలు.. ప్రియాంకపై మండిపడుతున్న నేతలు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా 'లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్' పేరుతో బరేలీలో మారథాన్‌కు పిలుపునిచ్చారు. ఈ మారథాన్ లో తొక్కిసలాట జరగడంతో పలువురు బాలికలు గాయపడ్డారు

Congress Marathon
Congress Marathon : ఫిబ్రవరిలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా ‘లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్’ (నేను అమ్మాయిని, నేను పోరాడగలను) పేరుతో బరేలీలో మారథాన్‌కు పిలుపునిచ్చారు. ప్రియాంక వాద్రా పిలుపుతో మారథాన్ కు భారీగా తరలివచ్చారు బాలికలు
చదవండి : Uttar Pradesh Politics : పేర్లు గందరగోళం…మరో పెర్‌ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు
మరికొద్ది నిమిషాల్లో మారథాన్ ప్రారంభం అవుతుందనగా వెనుక ఉన్న బాలికలు ఒక్కసారిగా ముందుకు కదిలారు దీంతో ముందున్నవారు కిందపడిపోయారు. ఈ క్రమంలోనే కిందపడిన వారిపైనుంచి వెళ్లిపోయారు కొందరు. ఈ ఘటనలో ముగ్గురు యువతులకు గాయాలైనట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. వీరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించిన వివరించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో రన్ నిర్వహించడంపై పలువురు రాజకీయ నేతలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకపై విమర్శలు గుప్పిస్తున్నారు.
చదవండి : Uttar Pradesh: రైల్వే స్టేషన్ల పేర్లు మారుస్తున్న యోగి ప్రభుత్వం
ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ నాయకురాలు, బరేలీ మాజీ మేయర్ సుప్రియా అరోన్ స్పందిస్తూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. “వైష్ణో దేవిలో తొక్కిసలాట జరిగినప్పుడు, వీళ్లు కేవలం అమ్మాయిలు మాత్రమే. ఇది మానవ స్వభావం. కానీ నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ” అంటూ ట్వీట్ చేశారు.
చదవండి : Uttar Pradesh : లక్ష మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు
ఇక ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. యూపీ పీఠం తమదంటే తమదని.. చెబుతున్నాయి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే.. యూపీ పీఠం తమదే అని ఎస్పీ నేతలు చెబుతున్నారు. ఇక బీఎస్పీ, కాంగ్రెస్ కూడా అధికారం తమదే అంటూ ధీమాగా చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల ముఖ్యనేతలు యూపీలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
#WATCH | Stampede occurred during Congress’ ‘Ladki hoon, Lad Sakti hoon’ marathon in Bareilly, Uttar Pradesh today pic.twitter.com/nDtKd1lxf1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 4, 2022