unnamed railway station : ‘పేరు లేని’ రైల్వే స్టేషన్..ఇండియాలోనే

భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్ కు అయినా పేరు ఉంటుంది కదా.. కానీ మన భారతదేశంలో ‘పేరు లేని’ ఓ రైల్వే స్టేషన్ ఉందని తెలుసా? నిజమేనండీ..ఆ రైల్వే స్టేషన్ కు పేరు ఉండదు. దీంతో ఆ రైల్వే స్టేషన్ ఇంట్రెస్టింగ్ గా మారింది.

unnamed railway station : ‘పేరు లేని’ రైల్వే స్టేషన్..ఇండియాలోనే

Unnamed Railway Station

without a name railway station in india : భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్ కు అయినా పేరు ఉంటుంది కదా..అదేంటీ పేరు లేకుండా ఏ స్టేషన్ అయినా ఉంటుందా? పేరు లేకపోతే అది ఏ స్టేషనో ఎలా తెలుస్తుంది? అంటారు కదూ. కానీ మన భారతదేశంలో ‘పేరు లేని’ ఓ రైల్వే స్టేషన్ ఉందని తెలుసా? నిజమేనండీ..ఆ రైల్వే స్టేషన్ కు పేరు ఉండదు. దాన్నే పేరు లేని రైల్వే స్టేషన్ అంటారు. ఏ స్టేషన్ కు అయినా పేరు తప్పనిసరిగా ఉంటుంది. మరి ఈ స్టేషన్ కు పేరు లేకుండా ఉందీ అంటే ఏదో విషయం ఉందనే కదా..అదేమంటే..

పశ్చిమ బెంగాల్‌లోని ఆద్రా రైల్వే డివిజన్‌లోని పేరులేని రైల్వే స్టేషన్ ఓ విశేషం. బంకురా-మసాగ్రామ్ రైలు మార్గంలో ఉన్న ఈ స్టేషన్ రైనా, రైనగర్ అనే రెండు గ్రామాల మధ్య వస్తుంది. ఈ స్టేషన్ ప్రారంభ రోజుల్లో ‘రైనాగర్’ అని పిలువబడేది. కానీ రైనా గ్రామ ప్రజలు దీనిని వ్యతిరేకించారు. మా గ్రామం పేరే పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గ్రామాల మధ్యా గొడవ మొదలైంది. ఈ విషయం కాస్తా రైల్వే బోర్డుకు చేరింది. వివాదాన్ని పరిష్కరించడానికి, రైల్వే స్టేషన్…అధకారులు యత్నించారు. కానీ ఫలితం లేదు. దీంతో ఇక లాభం లేదని బోర్డు నుండి స్టేషన్ ‘రైనాగర్’ పేరును తొలగించారు.అలాగని మరో గ్రామం అయిన ‘రైనా’పేరు కూడా పెట్టలేదు అధికారులు.
. మొత్తానికి ఈ రెండు గ్రామాల పేరు గొడవ కాస్తా ఆ స్టేషన్ కు పేరు లేకుండా పోయింది. అలా ‘పేరు లేని’ రైల్వే స్టేషన్ గా మిగిలిపోయిందా స్టేషన్.

ఇలా పేరు లేని రైల్వే స్టేషన్ వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పేరు లేకపోవడం వల్ల ప్రయాణీకులు దాని గురించి ఇతర వ్యక్తులను అడిగి తెలుసుకోవాల్సివస్తోంది. అయితే, రైల్వే శాఖ‌ ఇప్పటికీ దాని పాత పేరు రైనగర్ పేరుమీద‌నే ప్ర‌యాణీకుల‌కు టిక్కెట్లను ఇస్తోంది. కానీ బోర్డు మీద మాత్రం ‘పేరు’ ఉండదు. ఉత్త ఖాళీ బోర్డు మాత్రమే ఉంటుంది. పసుపు రంగుతో..