Suspicious Bag: ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్‌.. ఐఈడీ ఉండొచ్చని అనుమానం | A suspicious bag was found on the road in Old Seemapuri area of Delhi

Suspicious Bag: ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్‌.. ఐఈడీ ఉండొచ్చని అనుమానం

దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ సీమపురి ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ని పరిశీలిస్తున్నారు.

Suspicious Bag: ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్‌.. ఐఈడీ ఉండొచ్చని అనుమానం

Suspicious Bag: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ సీమపురి ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్ లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆ ప్రాంతంలో అనుమానాస్పద బ్యాగ్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, బాంబ్ స్క్వాడ్, ఎన్ఎస్జీ సంఘటనా స్థలంలో సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. బ్యాగ్‌లో ఐఈడీ ఉండవచ్చని భావిస్తున్నారు. బ్యాగ్ దొరికిన గదిలో 3-4 మంది అబ్బాయిలు అద్దెకు ఉంటున్నారని, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెబుతున్నారు.

ఢిల్లీలోని ఘాజీపూర్‌లో ఆర్డీఎక్స్ కేసును విచారిస్తున్న సమయంలో, స్పెషల్ సెల్ బృందం ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలోని ఇంటికి చేరుకుంది. స్పెషల్ సెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సీమాపురి ఇంటి నంబర్ డి-49 గోల్డ్ స్మిత్ వీధిలోని ఓ ఇంట్లో ఈ బ్యాగ్ లభ్యమైంది.

ప్రత్యేక సెల్ దర్యాప్తు చేస్తోండగా.. బ్యాగ్‌లో ఏముందో స్పష్టంగా వెలుగులోకి రాలేదు. బ్యాగును పరిశీలించిన తర్వాతే విషయాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. విషయం అనుమానాస్పదంగా కనిపిస్తోంది.

×