Teacher Sexually Assaulted Girls : 26 మంది స్కూల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడిపై 21 కేసులు నమోదు

కేరళలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. 26 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించారు.

Teacher Sexually Assaulted Girls : 26 మంది స్కూల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడిపై 21 కేసులు నమోదు

teacher assault

Teacher Sexually Assaulted Girls : కేరళలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. 26 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కేరళ జిల్లాలోని ఎయిడెడ్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు(52) విద్యార్థినులపై కన్నేశారు.

నవంబర్, 2021లో పాఠశాలలు పున:ప్రారంభమైన తర్వాత సదరు ఉపాధ్యాయుడు 26 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించారు. విద్యార్థినులు తమకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేకపోయారు. ఇటీవల ఓ విద్యార్థిని తనకు జరిగిన అవమానాన్ని మరో టీచర్ కు చెప్పింది. ఆ టీచర్ చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Teacher Raped Student : తొమ్మిదో తరగతి విద్యార్థినిపై రెండేళ్లుగా టీచర్ అత్యాచారం.. శ్రద్ధాకు పట్టిన గతే పడుతుందని వార్నింగ్

దీంతో చైల్డ్ లైన్ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులు ఇప్పటివరకు 21 కేసులు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు విద్యార్థినులన లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.