Jain Deity Kunthunath Idol : వెయ్యేళ్ల నాటి జైనుల ఆరాధ్యదైవం కుంతునాథ్ విగ్రహం లభ్యం

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెయ్యి ఏళ్ల నాటి జైనుల ఆరాధ్య దైవం కుంతునాథ్ రాతి విగ్రహం లభ్యం అయింది. జైన మతం ప్రకారం.. 24 జైన తీర్థంకరుల్లో కుంతునాథ్ ను 17వ తీర్థంకరుడిగా చెబుతారు.

Jain Deity Kunthunath  Idol : వెయ్యేళ్ల నాటి జైనుల ఆరాధ్యదైవం కుంతునాథ్ విగ్రహం లభ్యం

Jain Deity Kunthunath Idol : మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెయ్యేళ్ల నాటి జైనుల ఆరాధ్య దైవం కుంతునాథ్ రాతి విగ్రహం లభ్యం అయింది. జైన మతం ప్రకారం.. 24 జైన తీర్థంకరుల్లో కుంతునాథ్ ను 17వ తీర్థంకరుడిగా చెబుతారు. ఔంధ నాగనాథ్ పట్టణంలోని ఓ జైన ఆలయం పరిసరాల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా దీన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.

బసాల్ట్ రాయిపై చెక్కిన ఈ శిల్పం.. దానిపై ఉన్న మేక గుర్తు ప్రకారం కుంతునాథ్ భగవాన్ దిగా గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్త పలందే దాతర్ వెల్లడించారు.