Fake Begger: నకిలీ భిక్షగాడు.. తన వెనకో పెద్ద గ్యాంగ్!

బిక్షాటన చేసి కోట్లు వెనకేసిన వాళ్ళు.. పెద్ద పెద్ద విల్లాలు.. విలాసవంతమైన నివాసాలను నిర్మించుకున్న బిక్షగాళ్లని కూడా గతంలో కొందరిని చూశాం.

Fake Begger: నకిలీ భిక్షగాడు.. తన వెనకో పెద్ద గ్యాంగ్!

Fake Begger

Fake Begger: బిక్షాటన చేసి కోట్లు వెనకేసిన వాళ్ళు.. పెద్ద పెద్ద విల్లాలు.. విలాసవంతమైన నివాసాలను నిర్మించుకున్న బిక్షగాళ్లని కూడా గతంలో కొందరిని చూశాం. అయితే, అలాంటివి చూసినపుడు బిక్షమెత్తుకుంటే వీళ్ళకి ఇంత సంపాదన వస్తుందా అనే అనుమానాలు కూడా వస్తుంటాయి. అలాంటి అనుమానాలకు సమాధానమే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన. ఇండోర్ ట్రాఫిక్ పోలీసులు ఓ నకిలీ బిక్షగాడి బాగోతాన్ని బట్టబయలు చేశారు.

రాకేష్ అనే వ్యక్తి తనకు చేయి లేదని బిక్షగాడి రూపంలో ఇండోర్ లోని ఓ రోడ్డుపై సెంటర్ లో, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిక్షాటన చేస్తున్నాడు. కొద్దిరోజులుగా అతన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు అనుమానమొచ్చి రాకేష్ ను విచారించారు. దీంతో అసలు విషయం కక్కేశాడు. అతనికి కాళ్ళు, చేతులు అన్నీ బాగానే ఉన్నా ఓ చేతిని చొక్కాలో దాచుకొని చేయి లేదని బిక్షాటన చేస్తున్నాడు. అలా రోజుకు వెయ్యి రూపాయలపైన సంపాదిస్తున్నాడు.

ఈ కథనం చూడగానే.. అన్నీ బాగానే ఉన్నా ఈ పనిచేయడం ఎందుకు అనిపిస్తుంది కదా. ట్రాఫిక్ పోలీసులు కూడా రాకేష్ ను ఏదైనా పనిచేసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తే.. తాను ఏ పనిచేసినా రోజుకి వెయ్యి సంపాదించడం అసాధ్యమని.. ఇదొక్కటే మంచి గిట్టుబాటు అవుతుందని ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. రాకేష్ ఒక్కడే కాదు.. తన వెనుక పెద్ద గ్యాంగ్ కూడా ఉందట. అందరూ కలిసి ఇలా సిటీలో పలు ప్రాంతాలలో నటిస్తూ బిక్షాటన చేస్తున్నారట. ఈ స్టోరీ మొత్తం విన్న పోలీసులు అవాక్కవుతున్నారు.