Twitter user : లంచ్ కోసం వెళ్లి 14 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు

ఓ ట్విట్టర్ యూజర్ లంచ్ కోసం వెళ్లి 14 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు. ట్విట్ట‌ర్ యూజ‌ర్ 2007లో లంచ్ కోసం వెళ్లాడు.

Twitter user : లంచ్ కోసం వెళ్లి 14 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు

Lunch

A Twitter user returned after 14 years : ఓ ట్విట్టర్ యూజర్ లంచ్ కోసం వెళ్లి 14 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు. ట్విట్ట‌ర్ యూజ‌ర్ 2007లో లంచ్ కోసం వెళ్లాడు. లంచ్ పూర్తి చేసుకుని 14 ఏండ్ల త‌ర్వాత ఇప్పుడు తిరిగొచ్చాడు. లంచ్ కోసం 14 ఏళ్లు వెళ్ల‌డమేంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజం.. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మాన‌వ జీవ‌న విధానంలో నిత్యావ‌స‌రాలుగా మారిపోయాయి. సోష‌ల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్టు పెడుతుంటారు.

అలాగే @deleted అనే ట్విట్టర్ యూజర్ 2007, మార్చి 15న లంచ్‌కి వెళ్తున్నట్లుగా ఓ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత 14 ఏళ్లుగా అత‌డి నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. కానీ, 14 సంవత్సరాల తర్వాత 2021, జూలై 25న అతడు ట్విట్టర్‌లో మరో పోస్ట్‌ పెట్టాడు. ‘నేను లంచ్ నుంచి తిరిగి వచ్చేశా’ అని ఆ పోస్టులో పేర్కొన్నాడు. 2007లో లంచ్‌కు వెళ్తున్నాను అని పోస్ట్ చేసి, 2021లో లంచ్ నుంచి తిరిగి వ‌చ్చాను అని పేర్కొన‌డంతో ఈ రెండు పోస్టులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఆ రెండు పోస్టుల‌పై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. 14 సంవత్సరాల నుంచి అత‌ను లంచ్ చేస్తూనే గడిపాడా..? అని కొంద‌రు, అత‌ను అన్ని రోజులపాటు తిన్న ఆ పదార్థం ఏమిటి..? అని మ‌రికొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంద‌రేమో 14 ఏళ్ల క్రితం లంచ్‌కు వెళ్తున్న‌ట్లు పోస్ట్ పెట్టి పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోయి ఉంటాడ‌ని, ఇప్పుడు పాస్‌వ‌ర్డ్ మ‌ళ్లీ దొర‌క‌డంతో లంచ్ నుంచి తిరిగి వ‌చ్చిన‌ట్లు పోస్ట్ చేసి ఉంటాడ‌ని అంచ‌నా వేస్తున్నారు.

మరికొందరు ఈ ట్విట్ట‌ర్ యూజ‌ర్‌ 14 ఏళ్ల క్రితం లంచ్ కు వెళ్లున్న‌ట్లుగా పెట్టిన పోస్టును అలాగే ఉంచి ఆ త‌ర్వాత పోస్టులన్నింటిని డిలీట్ చేసి ఉంటాడ‌ని, ఆ పాత పోస్టుకు కొన‌సాగింపుగా ఇప్పుడు లంచ్ నుంచి తిరిగి కొత్త పోస్టు చేసి ఉంటాడ‌ని అంటున్నారు. ‘ఇప్పుడు నా వ‌య‌సు 14 ఏళ్లు, నువ్వు నా ప్రస్తుత జీవిత కాలం మొత్తం భోజనం చేస్తూనే ఉన్నావు’ అని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు.

‘అతడు లంచ్‌కి వెళ్లే సమయానికి నాకు కేవలం రెండేళ్లని, ఇప్పుడు నా వయసు 16 ఏళ్లు’ అని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. ఇలా పలువురు పలు రకాలుగా అతనిపై కామెంట్స్ చేశారు. ఎవరికి తోచినట్లు వారు కామెంట్ల వర్షం కురిపించారు.