Fighting For Eggs: కోడి గుడ్లు కోసం తన్నుకున్నారు.. రెండు వర్గాల మధ్య ఘర్షణలో మహిళ మృతి..
కోడి గుడ్లు పంచుకునే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ వర్గంవారు మరో వర్గంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి.

Fighting For Eggs
Fighting For Eggs: కోడి గుడ్లు పంచుకునే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ వర్గంవారు మరో వర్గంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఈ కేసులో ఐదుగురు నిందితులుగా గుర్తించిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్‌లోని ఖుద్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘర్షణలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణపై దౌద్‌నగర్‌లోని బీడీఓ కో- ఇన్‌ఛార్జ్ జోనల్ ఆఫీసర్ అరుణ కుమార్ మాట్లాడుతూ.. ఓ దుకాణంలో అప్పుగా తెచ్చుకున్న కోడిగుడ్లు విషయంలో ఈ వివాదం తలెత్తినట్లు తెలిపారు. అప్పుగా తెచ్చిన గుడ్లను తీసుకొనే విషయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని తెలిపారు. ఇదే సమయంలో ఓ వర్గంకు చెందిన వారు కాల్పులు జరపడంతో ఓ మహిళ మృతిచెందింది. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.
తీవ్ర గాయాలైన ఎనిమిది మంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అరుణ కుమార్ తెలిపారు. అయితే కాల్పులకు కారణమైన ఐదుగురిని గుర్తించామని, వీరిలో ముగ్గురు శంభు చౌదరి, ఉమేష్ చౌదరి, రాంబచన్ చౌదరిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నామని, వారి ఆచూకీ గుర్తించి అరెస్టు చేస్తామని తెలిపారు. గాయూపడిన వారిలో ధర్మేంద్ర రామ్, రీటా దేవి, కరీమన్ రామ్, అశోక్ రామ్, రామజనం రామ్, శివానందన్ రామ్, పంకజ్ కుమార్, కుందన్ కుమార్ తదితరులు ఉన్నారు.