Viral Videos: ఈమె ధైర్యం ముందు పది అడుగుల పామైనా సాహో అనాల్సిందే!

చిన్న పాటి బొద్దింక కనిపిస్తే చాలు కెవ్వున కేక పెట్టి దగ్గర ఎత్తుగా ఏది కనిపిస్తే అది ఎక్కి కూర్చుంటారు కొందరు. ఇక ఇంట్లో బల్లి, మంచం మీద నల్లి లాంటివి కనిపించినా ఇల్లు పీకి పందిరి వేసే వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది..

Viral Videos: ఈమె ధైర్యం ముందు పది అడుగుల పామైనా సాహో అనాల్సిందే!

Viral Videos

Viral Videos: చిన్న పాటి బొద్దింక కనిపిస్తే చాలు కెవ్వున కేక పెట్టి దగ్గర ఎత్తుగా ఏది కనిపిస్తే అది ఎక్కి కూర్చుంటారు కొందరు. ఇక ఇంట్లో బల్లి, మంచం మీద నల్లి లాంటివి కనిపించినా ఇల్లు పీకి పందిరి వేసే వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది పది అడుగుల పైన ఉండే పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైనే పోతాయ్. అందులో కూడా మహిళలలో ఎక్కువ మందికి పాము అంటేనే చాలు వణుకు వచ్చేస్తుంది. అలాంటిది ఓ మహిళ చూపిన ధైర్యం ముందు పది అడుగుల పైన ఉన్న పాము కూడా సాహో అనేసింది.

మే నెల 21వ తేదీన వియత్నాంలో ఓ మహిళ రోడ్డుపై వెళ్తూ వెళ్తూ పక్కనే వెళ్తున్న పామును చూసింది. వెంటనే బైకు ఆపేసి దిగి ఆ పామును పట్టుకొని దగ్గరలోని చెట్లలోకి వదిలేసింది. ఆ సమయంలో కారులో వెళ్తున్న ఇద్దరు యువకులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో కాస్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అందుకు కారణం ఆమె చూపిన ధైర్య సాహసాలే. ఆ పామును పట్టుకోవడంలో ఏ మాత్రం తేడా జరిగినా ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పైగా పాము చాలా బలంగా భారీగా కూడా ఉంది.

ఆ మహిళ పామును పట్టుకోగానే అది గింజుకుంటూ తప్పించుకొనేందుకు ప్రయత్నించింది. గిలగిల కొట్టుకుంటూ పాము మహిళను సైతం ఊపేసినా ఆమె పాము తల పట్టుకొని వదలలేదు. ఇక ఆమె చెట్లలోకి వదిలేందుకు వెళ్తుండగా పాము ఆమెని చుట్టేసినా అదరలేదు బెదరలేదు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ గురి కావడమే కాకుండా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ధైర్యసాహసాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.