Woman Tied Rakhi Leopard : చిరుత పులికి రాఖీ కట్టిన మహిళ.. సోషల్ మీడియాలో ఫొటో వైర‌ల్‌

అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతున్న చిరుత పులికి ఓ మ‌హిళ రాఖీ క‌డుతున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయింది. రాజ‌స్థాన్‌కు చెందిన ఈ వైర‌ల్ ఫొటో ప్ర‌కృతితో స‌హ జీవనానికి, జీవ వైవిధ్యానికి అద్దం ప‌డుతుంద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత నందా ఈ ఫొటోను షేర్ చేశారు.

Woman Tied Rakhi Leopard : చిరుత పులికి రాఖీ కట్టిన మహిళ.. సోషల్ మీడియాలో ఫొటో వైర‌ల్‌

woman tied rakhi leopard

Woman Tied Rakhi Leopard : సాధారణంగా రాఖీ పౌర్ణమి రోజున అన్నదమ్ములకు అక్కాచెళ్లెలు రాఖీలు కడతారు. కానీ ఓ మహిళ జంతువుకు రాఖీ కట్టింది. అది కూడా సాదా సీదా జంతువు కాదండోయ్.. ఏకంగా చిరుత పులికే రాఖీ కట్టింది. మరి ఆ చిరుత మహిళను ఏమీ అనలేదా? అయితే మీరే చూడండి..

అస్వ‌స్థ‌త‌తో బాధ‌ప‌డుతున్న చిరుత పులికి ఓ మ‌హిళ రాఖీ క‌డుతున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయింది. రాజ‌స్థాన్‌కు చెందిన ఈ వైర‌ల్ ఫొటో ప్ర‌కృతితో స‌హ జీవనానికి, జీవ వైవిధ్యానికి అద్దం ప‌డుతుంద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత నందా ఈ ఫొటోను షేర్ చేశారు.

PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు… వాళ్లంతా ఎవరో తెలుసా

ఈ వైర‌ల్ పిక్చ‌ర్‌లో అస్వ‌స్ధ‌త‌తో బాధ‌పడుతున్న చిరుత పులికి పింక్ శారీ ధ‌రించిన మ‌హిళ రాఖీ క‌డుతూ క‌నిపించింది. రాజ‌స్ధాన్‌లో ఓ మ‌హిళ వ‌న్య‌ప్రాణి ప‌ట్ల‌ బేష‌ర‌తు ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిస్తూ అస్వ‌స్ధ‌తతో కూడిన చిరుత‌ను అట‌వీ శాఖ‌కు అందించే ముందు దానికి రాఖీ క‌ట్టార‌ని, వ‌న్య‌ప్రాణుల ప‌ట్ల ప్రేమ‌, సోద‌ర‌భావాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని ట్విట్ట‌ర్‌లో ఈ ఫొటోను షేర్ చేస్తూ సుశాంత నంద పేర్కొన్నారు.

వ‌న్య‌ప్రాణి ప‌ట్ల మ‌హిళ చూపిన ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ను ఇంట‌ర్‌నెట్ స్వాగ‌తిస్తుంద‌ని ఓ నెటిజ‌న్ వ్యాఖ్యానించ‌గా, చిరుత‌కు రాఖీ క‌ట్ట‌డం ప్రేమ, ఆప్యాయ‌త‌కు సంకేత‌మ‌ని మ‌రో యూజ‌ర్ ప్ర‌శంసించారు. దేవుడు ఎన్నో జీవుల‌ను సృష్టించారని, ప్రపంచం కేవ‌లం మ‌నుషుల‌కే కాద‌ని మ‌రో యూజ‌ర్ రాశారు.