Uttar Pradesh : శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్న యువతి

ఉత్తరప్రదేశ్ లోని ఔరైయా జిల్లాలో వినూత్న వివాహం జరిగింది. ఓ యువతి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్నారు. ఆ యువతి శ్రీకృష్ణుడితో ఏడడుగులు నడిచింది. పూర్తి ఆచారాలతో శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు.

Uttar Pradesh : శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్న యువతి

young lady

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లోని ఔరైయా జిల్లాలో వినూత్న వివాహం జరిగింది. ఓ యువతి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్నారు. ఆ యువతి శ్రీకృష్ణుడితో ఏడడుగులు నడిచింది. పూర్తి ఆచారాలతో శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు. పండితులు వేద మంత్రాలు చదివారు. బంధువులందరికీ వివాహ వింధు ఇచ్చారు. పెళ్లయ్యాక వధువుకు వీడ్కోలు పలికిన విధంగానే ఆ యువతికి కూడా బంధువులు వీడ్కోలు పలికారు. ఈ వినూత్న వివాహం చర్చనీయాంశమైంది.

ఔరైయా జిల్లాలోని బిదువా పట్టణానికి చెందిన రక్షా సోలంకి శ్రీకృష్ణుడికి పరమ భక్తురాలు. ఆమె సర్వస్వం కృష్ణుడికి సమర్పించుకున్నారు. బిదునాకు చెందిన రంజిత్ సింగ్ సోలంకి కుమార్తె రక్షా సోలంకి శ్రీకృష్ణుడి భక్తిలో నిమగ్నమై ప్రేమించింది. రక్షాసోలంకి గతేడాది జులైలో కుటుంబంతో కలిసి బృందావనంకు వెళ్లారు. అప్పటి నుంచి యువతి మనస్సులో శ్రీకృష్ణుడిపై ఉన్న ప్రేమ బయటపడింది. తాను శ్రీకృష్ణుడిని కలలో వివాహం చేసుకున్నానని, శ్రీకృష్ణుడికి పూర్తిగా అంకితమైపోయానని తెలిపారు.

Sri Krishna Birthplace : శ్రీకృష్ణుడు జన్మస్థలంగా చెబుతున్న మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది ?

తాను కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆ యువతి తండ్రితో చెప్పారు. అందుకు అంగీకరించిన తండ్రి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులందరిని పిలిచి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని మండపానికి తీసుకొచ్చి పెళ్లి జరిపారు. సంప్రదాయ పద్ధతిలో వివాహం నిర్వహించారు. అయితే గతంలో కూడా ఇలాంటి పెళ్లిళ్లు జరిగాయి.