పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువ‌తిపై ఏడాదిగా అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువ‌తిపై ఏడాదిగా అత్యాచారం

A young man rapes a young woman for a year : గుజ‌రాత్ లో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువ‌తిపై ఓ యువకుడు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లోని కేడియాలో చోటు చేసుకుంది. స్థానిక యువ‌కుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని ప్రాంతానికి చెందిన యువ‌తిని సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుందామ‌ని న‌మ్మిస్తూ ఏడాదికిపైగా ప‌లుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే ఉన్న‌ట్లుండి గ‌త 2 నెల‌లుగా యువకుడు ముఖం చాటేశాడు. దీంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిడ్డి ల‌డ్కా పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా క‌లిగిన 20 ఏళ్ల యువ‌కుడు 2019 జూన్‌లో ఉజ్జ‌యినికి చెందిన 22 ఏళ్ల యువ‌తికి ఫాలో రిక్వెస్ట్ పంపించాడు. ఆ రిక్వెస్ట్‌ను యువ‌తి యాక్సెప్ట్ చేయ‌డంతో వారు త‌ర‌చుగా చాటింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలోనే యువ‌కుడు 2019 ఆగ‌స్టులో బ్లేడుతో చేయి కోసుకున్న ఫొటోల‌ను యువతికి పంపించాడు. యువతి త‌న‌ను క‌లిసేందుకు అహ్మ‌దాబాద్‌కు రాక‌పోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించాడు.

దాంతో నిజంగానే ఆత్మ‌హ‌త్య‌ చేసుకుంటాడేమోన‌ని భ‌య‌పడిన యువ‌తి అహ్మ‌దాబాద్‌కు వెళ్లింది. అక్క‌డ ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లిన యువ‌కుడు పెండ్లి చేసుకుందామంటూ మాయ‌మాట‌లు చెప్పి ఆమెపై ప‌లుమార్లు అత్యాచారం చేశాడు. మూడు రోజుల‌పాటు హోట‌ల్‌లోనే ఉంచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంత‌రం 2019 అక్టోబ‌ర్‌లో మ‌రోసారి యువ‌తిని అహ్మ‌దాబాద్‌కు ఆహ్వానించి అత్యాచారం చేశాడు. ఈ విధంగా 2020 అక్టోబ‌ర్ వ‌ర‌కు స‌ద‌రు యువ‌కుడు యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

అయితే గ‌త 2 నెల‌ల నుంచి సదరు యువకుడు ముఖం చాటేయడంతో బాధిత యువ‌తి మోసపోయాన‌ని గ్ర‌హించింది. దీంతో ఉజ్జ‌యిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువ‌తి ఫిర్యాదును స్వీక‌రించిన‌ పోలీసులు.. నేరం అహ్మ‌దాబాద్‌లోని కేడియా ప్రాంతంలో జ‌రిగినందున కేసును అక్క‌డికి బ‌దిలీ చేశారు.