Young Man Run 350 KM : ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షలు జరపాలంటూ.. రాజస్థాన్‌ నుంచి ఢిల్లీకి పరుగెత్తుకొచ్చిన యువకుడు

ఆర్మీలో చేరాలన్న తన సంకల్పం కోసం వందల కిలోమీటర్లు పరిగెత్తాడు. ఆర్మీ రీక్రూట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాలంటూ నిరసనగా పరుగులు పెట్టాడు.

Young Man Run 350 KM : ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షలు జరపాలంటూ.. రాజస్థాన్‌ నుంచి ఢిల్లీకి పరుగెత్తుకొచ్చిన యువకుడు

Man Run

young man run 350 km : రాజస్థాన్‌ నుంచి ఢిల్లీకి దూసుకొచ్చాడు..350 కిలోమీటర్లు పరుగెత్తుకొచ్చాడు..! అది కూడా కేవలం 50గంటల్లోనే..! అవును..! తన ఆశయసాధన కోసమే ఇదంతా చేశాడు ఆ యువకుడు. ఆర్మీలో చేరాలన్న తన సంకల్పం కోసం వందల కిలోమీటర్లు పరిగెత్తాడు. ఆర్మీ రీక్రూట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహించాలంటూ నిరసనగా పరుగులు పెట్టాడు. తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను దేశానికి చూపించాడు రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన సురేశ్‌ భిచార్‌.

24సంవత్సరాల సురేశ్‌ ఆర్మీలో ఉద్యోగం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆలస్యంపై ఢిల్లీలో ఆర్మీ అభ్యర్ధులు నిరసన చేపట్టడంతో అక్కడకు సురేష్ భిచార్‌ పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. రాజస్థాన్‌లోని సికార్ నుంచి ఢిల్లీ వరకు పరిగెత్తుకొచ్చాడు.

Ap High Court : చదునైన పాదం ఉంటే ఆ ఉద్యోగానికి అనర్హులు : హైకోర్టు ఆసక్తికర తీర్పు

తనకు ఆర్మీలో చేరాలనే కోరిక ఉందని సురేష్ భిచార్ తెలిపాడు. రెండేళ్ల నుంచి ఆర్మీలో నియామకాలు జరగడం లేదని.. నాగౌర్, సికార్‌లకు చెందిన ఎందరో యువకులు వయసు దాటిపోయి పోటీ పరీక్షలకు అనర్హులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగ నియామకాల విషయంలో బాధపడుతున్న యువతలో ఉత్సాహాన్ని నింపేందుకే తాను పరుగులు పెడుతూ రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వచ్చినట్లుగా చెప్పాడు.

ఎందరో యువకులు ఆర్మీ ఉద్యోగాల కోసం అన్ని రకాలుగా ప్రిపేర్ అయినా.. నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్మీలో ఉద్యోగ నియామకాలు జరపాలని, రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్స్‌ వెంటనే కండక్ట్ చేయాలని డిమాండ్ చేశాడు.