Stock Market : మరో బ్లాక్ డే…స్టాక్ మార్కెట్లు భారీ పతనం, లక్షల కోట్ల సంపద ఆవిరి

దక్షిణాఫ్రికాలో అత్యంత వేగంగా వ్యాపించే కరోనా వైరస్ స్ట్రెయిన్ బయటకు రావడం మార్కెట్లను టెన్షన్ పెట్టింది. ఆ దేశం నుంచి కొన్ని దేశాలకు విమానాల రాకపోకలను కూడా నిలిపివేశారు.

Stock Market : మరో బ్లాక్ డే…స్టాక్ మార్కెట్లు భారీ పతనం, లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock Market Crash : సౌతాఫ్రికాలో పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపెట్టింది. కరోనా మరోసారి స్టాక్‌మార్కెట్లను కుప్పకూల్చింది. ఇన్వెస్టర్లను నిండా ముంచింది. లక్షల కోట్ల సంపదను ఒక్క రోజులో ఆవిరి చేసింది. సెన్సెక్స్ 1687 పాయింట్లు, నిఫ్టీ 509 పాయింట్లు కోల్పోయాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 13వందల 39 పాయింట్లు నష్టపోయింది. ఒక్కరోజులో సుమారు 7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయమైంది. అంటే నిమిషానికి దాదాపు 19 వందల కోట్లు మాయమైపోయాయి.

Read More : Tirupati : వింత ఘటన..వాటర్‌‌ట్యాంక్ పైకి ఎందుకొచ్చిందంటే

2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. మధ్యాహ్నం తర్వాత మరింత పతనమయ్యాయి. సెన్సెక్స్ ఓ దశలో 56వేల దిగుపకు పడిపోయి తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ కూడా 17వేల దిగువకు పడిపోయి తర్వాత కీలక మార్క్ ను టచ్ చేసింది. ఒక్క ఫార్మా మినహా మిగిలిన అన్ని ఇండెక్స్ లు 1 నుంచి 6శాతం పడిపోయాయి. ఇన్ని నష్టాల్లోనూ ఫార్మా ఇండస్ట్రీ మాత్రం 2శాతం లాభపడింది.

Read More : Stock Markets: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..!

దక్షిణాఫ్రికాలో అత్యంత వేగంగా వ్యాపించే కరోనా వైరస్ స్ట్రెయిన్ బయటకు రావడం మార్కెట్లను టెన్షన్ పెట్టింది. ఆ దేశం నుంచి కొన్ని దేశాలకు విమానాల రాకపోకలను కూడా నిలిపివేశారు. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో యూరోప్‌లో లాక్‌డౌన్‌ భయాలు నెలకొన్నాయి. యూరోపియన్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్‌ కారణంగా నష్టాలు మరింత పెరుగుతాయన్న ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఒక్కరోజులోనే దాదాపు రెండున్నర వేల కోట్ల మేరకు అమ్మకాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.