కేజ్రీ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు..బాంబు పేల్చిన ఆదర్శ్ శాస్త్రి

  • Published By: madhu ,Published On : January 19, 2020 / 04:25 AM IST
కేజ్రీ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు..బాంబు పేల్చిన ఆదర్శ్ శాస్త్రి

దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మరోసారి అధికారంలోకి రావడానికి ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో కేజ్రీవాల్‌ను మరోసారి సీఎం చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఆప్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ద్వారక్ నియోజకవర్గం నుంచి టికెట్ తిరిగి ఇచ్చేందుకు కేజ్రీవాల్ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారని బాంబు పేల్చారు. దీంతో తాను షాక్‌కు గురైనట్లు, అంత డబ్బు ఇవ్వకపోవడంతో తనకు టికెట్ కేటాయించలేదని ఆరోపించారు. తన స్థానంలో వినయ్ మిశ్రాకు తన స్థానం కేటాయించినట్లు తెలిపారు. వినయ్ మిశ్రా, ఇతరులు భూ కబ్జాలు చేసి సంపాదించారని, అలాంటి పని చేయలేదని..అందుకే తన దగ్గర అంత పైసలు లేవన్నారు.

ఈ వ్యాఖ్యలు నమ్మకపోయినా..ఇదే నిజమన్నారు ఆయన. ఎమ్మెల్యేలను కలిసేందుకు కేజ్రీవాల్ సమయం ఇవ్వడం లేదని, టికెట్ల పంపిణీని ఒక వ్యాపారంలా మార్చేశారని దుయ్యబట్టారు. 

ఆదర్శ్ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఆప్ నేతలు కొట్టిపారేస్తున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనువడు ఆదర్శ్ శాస్త్రి. ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే. 2020, జనవరి 18వ తేదీ శనివారం ఆప్‌ పార్టీకి రాజీనామా చేసి..కాంగ్రెస్ గూటికి చేరారు. 

Read More : RSS ఇద్దరు పిల్లల ప్లాన్..జనాభాను నియంత్రించడానికంట