గుడ్ న్యూస్ : ఆధార్ లో అడ్రస్ మార్పు మరింత ఈజీ

ఆధార్ కార్డులో అడ్రస్ మార్పుకి సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆధార్ కార్డుల్లో అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులువు చేసింది. ఇందుకోసం సెల్ఫ్ డిక్లరేషన్

  • Edited By: veegamteam , November 14, 2019 / 03:33 AM IST
గుడ్ న్యూస్ : ఆధార్ లో అడ్రస్ మార్పు మరింత ఈజీ

ఆధార్ కార్డులో అడ్రస్ మార్పుకి సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆధార్ కార్డుల్లో అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులువు చేసింది. ఇందుకోసం సెల్ఫ్ డిక్లరేషన్

ఆధార్ కార్డులో అడ్రస్ మార్పుకి సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఆధార్ కార్డుల్లో అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులువు చేసింది. ఇందుకోసం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఉపాధి కోసం చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళతారు. అయితే కొత్త ప్రాంతంలో బ్యాంకు అకౌంట్ తెరవాలంటే ఇబ్బంది పడుతున్నారు. దీంతో సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా చిరునామా మార్చుకుని.. బ్యాంకు ఖాతాలను తెరవొచ్చు. ఆధార్ కార్డులో సొంతింటి చిరునామా ఉన్నప్పటికీ.. సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా పని చేసే ప్రాంతం చిరునామాను ఇవ్వొచ్చు.

సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి ఆధార్ కార్డులో చిరునామాను ఎన్నిసార్లు అయినా మార్పు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది.

ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ కీలకమైన డాక్యుమెంట్. ధ్రువీకరణతోపాటు ప్రభుత్వ పథకాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు, బ్యాంక్ సేవలకు ఆధార్ చాలా అవసరం. పలు చోట్ల ఆధార్ వివరాలు అవసరం అవుతాయి. ఆధార్ లో మార్పులు చేయాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఆన్ లైన్ లో లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి మార్పులు చేసుకోవాలి. ఆ తర్వాత అప్ డేట్ కావడానికి సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అడ్రస్ చేసుకునే వెసులుబాటు తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.