Aadhaar: 5 ఏళ్లు నిండిన పిల్లల పేరెంట్స్.. యుఐడీఏఐ అలెర్ట్!

దేశంలో ఐదేళ్లు నిండిన పిల్లల తల్లిదండ్రులకు యుఐడీఏఐ ఓ అలెర్ట్ ఇచ్చింది. ఐదేళ్లు నిండిన పిల్లలకు ఆధార్ అప్డేట్ చేయించాలని సూచించింది. ఇండియాలో ప్రజలందరికీ ఆధార్ సర్వీస్, మెయింటనెన్స్ చేస్తున్న యూఐడీఏఐ పిల్లల ఆధార్ పై మరోసారి కీలక అలెర్ట్ ఇచ్చింది.

10TV Telugu News

Aadhaar: దేశంలో ఐదేళ్లు నిండిన పిల్లల తల్లిదండ్రులకు యుఐడీఏఐ ఓ అలెర్ట్ ఇచ్చింది. ఐదేళ్లు నిండిన పిల్లలకు ఆధార్ అప్డేట్ చేయించాలని సూచించింది. ఇండియాలో ప్రజలందరికీ ఆధార్ సర్వీస్, మెయింటనెన్స్ చేస్తున్న యూఐడీఏఐ ఎప్పటికప్పుడు ఆధార్ సేవలకు సంబంధించి ప్రజలకు సలహాలు, సూచనలు.. పలు సేవల మార్పుల గురించి సమాచారం కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పిల్లల ఆధార్ పై మరోసారి కీలక అలెర్ట్ ఇచ్చింది.

ఇప్పటి వరకు మన దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల ఆధార్ ఇస్తున్నారు. ఇందులో చిన్నారి ఫోటో తప్ప బయోమెట్రిక్, ఐరిస్ సర్వీస్ వంటివి ఆ సమయంలో తీసుకోరు. కానీ, ఆ చిన్నారికి ఐదేళ్లు నిండిన తర్వాత ఆధార్ సెంటర్ లో మరోసారి బాల ఆధార్ ను అప్డేట్ చేసుకొని వేలిముద్రలతో ఐరిస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని యూఐడీఏఐ మరోసారి గుర్తు చేసింది.

5 ఏళ్లు నిండిన పిల్లలకు బయోమెట్రిక్స్ (iris scan), fingerprints)ని ఆధార్ కార్డులో తప్పనిసరిగా నవీకరించాలని యుఐడీఏఐ తాజాగా మరోసారి ట్వీట్ ద్వారా తెలిపింది. పిల్లల తల్లిదండ్రులు తక్షణమే ఈ ఆధార్ అప్డేట్ చేయించాలని కోరింది.

10TV Telugu News