మహారాష్ట్ర సీఎంగా 29ఏళ్ల యువకుడు…శివాజీ పార్క్ లో ప్రమాణస్వీకారం

మహారాష్ట్ర సీఎంగా 29ఏళ్ల యువకుడు…శివాజీ పార్క్ లో ప్రమాణస్వీకారం

మహారాష్ట్రకు యువ సీఎం రాబోతున్నాడు. 29ఏళ్ల యువకుడు మహారాష్ట్రాన్ని పాలించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో వర్లీ స్థానం నుంచి గెలుపొందిన శివసేన చీఫ్ ఉద్దవ్ కుమారుడు ఆదిత్యఠాక్రే మహా సీఎం పీఠంపై కూర్చోనున్నారు. అంతేకాకుండా ఆదిత్యఠాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేసే వేదికను కూడా ఆ పార్టీ పిక్స్ చేసింది. ముంబైలోని శివాజీ పార్క్ లో ఆదిత్యఠాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.శివసేన కోర్ కమిటీ మెంబర్,ఆదిత్య ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు రాహుల్ ఎన్ కనాల్ ఈ విషయాన్ని తెలిపారు. 

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం సీటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య గ్యాప్ ఏర్పడిన సమయంలో ఇవాళ(నవంబర్-6,2019)శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ని కలిశారు. పవార్ నివాసానికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు.

గడిచిన 10రోజుల్లో పవార్ ని సంజయ్ కలవడం ఇది మూడోసారి. గత నెల 24న వెలువడిన మహారాషట్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటిమికి స్పష్టమైన మెజారిటి వచ్చినప్పటికీ శివసేన 50:50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగుస్తుంది.