AAP Punjab: పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలను నామినేట్ చేసిన ఆమ్ ఆద్మీ | Aam Aadmi party nominates five candidates to Rajyasabha from Punjab

AAP Punjab: పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలను నామినేట్ చేసిన ఆమ్ ఆద్మీ

పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది

AAP Punjab: పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలను నామినేట్ చేసిన ఆమ్ ఆద్మీ

AAP Punjab: పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ..జాతీయ రాజకీయాలపై పట్టుసాధించే దిశగా అడుగులు వేస్తుంది. ఈక్రమంలో పంజాబ్ రాష్ట్రం నుంచి ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఐదు రాజ్యసభ స్థానాలకు ఆప్ రాజ్యసభ అభ్యర్థులుగా క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసింది. పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది.

Also Read: Noida: ఇంటికి అర్ధరాత్రి పరుగు.. యువకుడి కారణానికి ఫిదా అయిన సినిమా డైరక్టర్

ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 92 స్థానాలు గెలుచుకున్న ఆప్.. అక్కడ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నామినేషన్ దాఖలుకు సోమవారం చివరి రోజు కాగా మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నామినేట్ చేసిన అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే..హర్భజన్ సింగ్ భారత క్రికెట్ జట్టులో స్పిన్ మాంత్రికుడిగా దేశ ప్రజలకు సుపరిచితమే. ఢిల్లీ రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న రాఘవ్ చద్దా అతిచిన్న వయసులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈయన పంజాబ్ ఆప్ పార్టీ ఇంచార్జ్ గా, ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు.

Also Read: AP Illicit Liquor Deaths : టీడీపీ నిరసన ప్రదర్శన.. జగన్ ఫొటోకి మద్యంతో అభిషేకం

ఇక ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడు. చాలా కాలంగా ఆప్ లో కొనసాగుతున్న సందీప్ పాఠక్..పార్టీని సమన్వయ పరుస్తూ ఎన్నికల వ్యూహాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆమ్ ఆద్మీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్ కూడా ఉన్నారు. విద్యా రంగంలో చేస్తున్న సేవలను గుర్తిస్తూ అశోక్ మిట్టల్ ను రాజ్యసభ సభ్యుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ నామినేట్ చేసింది. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరా ఈ జాబితాలో కొత్తగా చేరారు. ఆయను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేయడం ఆఖరి క్షణంలో తీసుకున్న నిర్ణయంగా తెలుస్తుంది.

Also Read: AP Assembly : స్పీకర్ సీరియస్.. బజార్ కాదు.. శాసనసభ, మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్

×