Aam Aadmi Party: ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వంతు?.. కేజ్రీవాల్ నిర్వహిస్తున్న భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు.. ఫోన్లూ స్విచ్ఛాఫ్ 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం అవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆప్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదని.. అలాగే, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని సమాచారం. వారి ఫోన్లు స్విచ్ఛాప్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ ఢిల్లీలోనూ అదే పని చేయడానికి కుట్రలు పన్నుతోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే.

Aam Aadmi Party: ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వంతు?.. కేజ్రీవాల్ నిర్వహిస్తున్న భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు.. ఫోన్లూ స్విచ్ఛాఫ్ 

Aam Aadmi Party

Aam Aadmi Party: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం అవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆప్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదని.. అలాగే, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని సమాచారం. వారి ఫోన్లు స్విచ్ఛాప్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టిన బీజేపీ ఢిల్లీలోనూ అదే పని చేయడానికి కుట్రలు పన్నుతోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే.

ఆప్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలని, లేదంటే నకిలీ కేసులు, సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటారని వారిని ఆ పార్టీ హెచ్చరించిదని ఆమ్ ఆద్మీ పార్టీ నిన్న ఆరోపించింది. పార్టీ మారితే ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఇస్తామని ఆశ చూపిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలు మాత్రం కనపడకుండా పోయారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారన్న ఉత్కంఠ ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర ప్రధాన పార్టీల్లోనూ నెలకొంది. ఇవాళ నిర్వహిస్తున్న సమావేశంలో బీజేపీ తీరు, సీబీఐ, ఈడీ దాడులు వంటి అంశాలపై చర్చించనున్నారు.

Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. మరో 12 మందికి తీవ్రగాయాలు